జాతీయ వార్తలు

ఆందోళన చెందకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: అరుణాచల్‌ప్రదేశ్‌లో నివాసం ఉంటున్న ఆరు గిరిజన తెగలకు చెందిన ప్రజలకు శాశ్వత నివాస ధృవపత్రాలు అందజేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌కు పక్క రాష్టమ్రైన అస్సాంలో ఇవే ఆరు గిరిజన తెగల ప్రజలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత నివాస ధృవపత్రాలు అందజేసిన నేపథ్యంలో స్థానికంగా ఉంటున్న తమకు ఇవ్వకుండా జాప్యం చేయడాన్ని నిరసిస్తూ బాధితులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర హోంమత్రి శాశ్వత నివాస ధృవపత్రాల జారీ విషయమై అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూతో కేంద్ర మంత్రి మాట్లాడారు. రాష్ట్ర సరిహద్దులో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ముఖ్యమంత్రి సవివరంగా చెప్పారు. వాస్తవానికి అరుణాచల్‌ప్రదేశ్‌లోని డియోరిస్, సోనోవాల్ కచారీస్, మోరాన్స్, ఆదివాసీస్, మిషింగ్స్, గోర్ఖాస్ అనే ఈ ఆరు తెగల ప్రజలను అసోంలో గిరిజనులుగా అక్కడి ప్రభుత్వం గుర్తించింది. అయితే, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని నమ్‌సాయి, చాంగ్‌లాంగ్ జిల్లాల్లో అత్యధిక శాతం ఉన్న ఈ ఆరు గిరిజన తెగలకు శాశ్వత నివాస ధృవపత్రాలు అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది.