జాతీయ వార్తలు

ప్రగతిలోనే మా పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23:మరి కొన్ని నెలల్లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్రభుత్వ విజయాలను ఏకరవుపెట్టారు. గత ఐదేళ్లుగా అభివృద్ధి పరుగులు పెడుతోందని, ద్రవ్యోల్బణాన్ని కూటా కనిష్టస్థాయికి తీసుకొచ్చామని చెప్పారు. గత యూపీఏ హయాంలో అవినీతిలోనే పోటీ ఉండేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు పాలనాపరంగానూ, అభివృద్ధి సాథన విషయంలోనూ ఎన్నో విజయాలను నమోదు చేసుకున్నామన్నారు. పైగా తమ పార్టీ పాలనను యూపీఏ పాలనతో ఏకోశానా పోల్చడానికీ వీల్లేదని, నాడు అవినీతి రాజ్యమేలితే తమ హయాంలో అభివృద్ధి ప్రాధాన్యతను సంతరించుకుందని శనివారం ఇక్కడ జరిగిన ఏకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో మోదీ తెలిపారు. పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు తాను చేపడుతున్న చర్యల్ని ఈ సందర్భంగా వెల్లడించిన ప్రధాని మోదీ ‘్భరత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నాం. స్టార్టప్‌లు, పునర్వినియోగ ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాల్లోనూ దేశాన్ని పరుగులు పెట్టిస్తాం’అని తెలిపారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాక ముందు వెన్ను విరిచే ద్రవ్యోల్బణం, తీవ్రమైన ద్రవ్య లోటు దేశ సూక్ష్మ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేవిగా ఉండేవని మోదీ అన్నారు. యూపీఏ పాలనంతా అవినీతిమయమేనంటూ తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తిన ఆయన ‘మంత్రిత్వ శాఖలు, వ్యక్తుల మధ్య అవినీతిలో పోటీ ఉండేది. ప్రాజెక్టులను జాప్యం చేయడంలోనూ పోటీ ఉండేది. అన్నింటికీ మించి కొత్త తరహాలో అవినీతికి ఎలా పాల్పడవచ్చునన్న దానిపైనా పోటీ ఉండేది’ అం టూ ఎద్దేవా చేశారు. బొగ్గు గనుల కేటాయింపు, స్పెక్ట్రమ్, కామనె్వల్త్ క్రీడలు, రక్షణ ఒప్పందాలు ఇలా ఒకటేమిటి డబ్బును ఎలా సంపాదించాలన్న అన్నింటిపైనా నాటి యూపీఏ హయాంలో ఎడతెగని పోటీ కొనసాగిందని ఆరోపించారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గుణాత్మక మార్పులు తెచ్చామని, పెట్టుబడుల్ని ఆకర్షించామని, పేదలకు ఇళ్లను నిర్మించామని మోదీ వివరించారు. తాము పగ్గాలు చేపట్టిన తర్వాత అభివృద్ధిలో పోటీ పెరిగిందని, రోడ్ల నిర్మాణం, గ్యాస్ కనెక్షన్లు, పారిశుద్ధ్యం ఇలా అనేక జనహిత లక్ష్యాలను సాధించడానికి తాము పోటీ పడ్డామని మోదీ తెలిపారు. అలాగే అభివృద్ధి లక్ష్యాల సాధనలో మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాల మధ్య కూడా గుణాత్మక పోటీ పెరిగిందని తెలిపారు. గత ఐదు సంవత్సరాల్లో 7.4శాతం మేర అభివృద్ధి నమోదైందని, ద్రవ్యోల్బణం కూడా 4.5శాతం దిగువకు వచ్చిందని చెప్పారు. ఆర్థిక సరళీకరణ శకంలో ఈ స్థాయి వృద్ధి రేటు నమోదు కావడం, ద్రవ్యోల్బణం తగ్గడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. ప్రభుత్వాలు ఏకకాలంలో వృద్ధి అనుకూల, పేదల అనుకూలంగా కొనసాగలేవని చెబుతారని, కానీ భారత ప్రజలు ఇది సాధ్యమేనని నిరూపించారని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో జరిగిన దానికి తామేమీ చేయలేమని, పైగా అది తమ చేతుల్లో కూడా లేదని చెప్పిన మోదీ ‘్భవిష్యత్ అంతా మన చేతుల్లో ఉంది’అని ఉద్ఘాటించారు.