జాతీయ వార్తలు

దేశంలో ఉద్యోగాల సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం దేశంలో ఉద్యోగాల సంక్షోభం2 ఉందనే విషయా న్ని అంగీకరించదలచుకోలేదని ఆయన అన్నారు. ప్రధానమంత్రి ఈ సమస్యను పరిష్కరించడానికి యువతతో చర్చలు జరపాలని ఆయన సూచించారు. రాహు ల్ గాంధీ శనివారం ఇక్కడి జేఎల్‌ఎన్ స్టేడియంలో యూనివర్శిటి విద్యార్థులతో జరిపిన 3శిక్ష.. దశ ఔర్ దిశ2 కార్యక్రమంలో మాట్లాడుతూ దేశ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమయి ఉందని ఆరోపించారు. విద్యారంగంలో అత్యధిక భా గాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని, ఇం దుకు అనుగుణంగా ఈ రం గంపై వ్య యాన్ని పెంచాలని ఆయన సూచించారు. అయితే, రాహుల్ వ్యాఖ్యలపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. చైనా ఆర్థికం గా వృద్ధి చెందుతోందని, మన దేశంలో అనేక వస్తువులపై 3మేడ్ ఇన్ చైనా2 (చైనాలో తయారయింది) అనే లేబుళ్లను ఎవరైనా చూడవచ్చని రాహుల్ గాంధీ అన్నారు. ఇరు దేశాల్లో ప్రతి గంటకు సృష్టిస్తున్న ఉద్యోగాల గణాంకాలను ఉటంకిస్తూ ఆయన ప్రధానిపై విరుచుకుపడ్డారు. 31.2 బిలియన్ మంది ప్రజలు ఉన్న భారత్‌లో ప్రతి 24 గంటలకు 450 ఉద్యోగాలు సృష్టించడం జరుగుతోందని, చైనాలో అదే 24 గంటల సమయంలో 50,000 ఉద్యోగాల సృష్టి జరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ గణాంకాలు తాను చెబుతున్నవి కాదని, సాక్షాత్తూ భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్‌సభలో ఇచ్చినవని ఆయన పేర్కొన్నారు. 3మన ప్రధానమంత్రి దీనిని ఒక సమస్యగా ఆలోచిస్తున్నట్టు కనబడటం లేదు2 అని రాహుల్ గాంధీ నిశితంగా విమర్శించారు. 3ముందు మనం ఈ సమస్య ఉందనే వాస్తవాన్ని అంగీకరించ వలసిన అవసరం ఉంది. తరువాత మనం ఈ సమస్యపై పోరాడటానికి మద్దతు కూడగట్టుకోవలసిన అవసరం ఉంది. మేము (కాంగ్రెస్) విశ్వసిస్తున్నది అదే2 అని ఆయన అన్నారు. తాను ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాఫెల్, అవినీతి, నిరుద్యోగం తదితర అంశాలపై తనతో చర్చకు రావాలని సవాలు విసిరానని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. 3కాని, ఆయన ఇలా మీ వద్దకు వచ్చి చర్చించారా? మీ ప్రశ్నలు విన్నారా?2 అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విద్యార్థులను అడిగారు. ప్రధానమంత్రి విద్యార్థులతో ఇష్టాగోష్ఠిగా సమావేశమయి, ఉద్యోగాల పరిస్థితిపై వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని రాహుల్ గాంధీ హితవు పలికారు. 3ఈ సమస్యను పరిష్కరించడానికి ఆయనకు (ప్రధానికి) మీ మద్దతు అవసరం ఉంది2 అని ఆయన విద్యార్థులతో అన్నారు. ప్రధానమంత్రి తన అభిప్రాయాలను యువతకు చెప్పడం కాకుండా, యువత అభిప్రాయాలను వినాలని రాహుల్ గాంధీ అన్నారు. బడ్జెట్‌లో విద్యారంగం వాటా పెరగాలని ఆయన ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. విద్యావ్యవస్థను మెరుగుపరచడానికి ప్రైవేటీకరణయే మార్గమనే వాదనతో కాంగ్రెస్ పార్టీ ఏకీభవించదని, ఆ వాదనకు మద్దతు ఇవ్వదని రాహుల్ స్పష్టం చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గౌరవసూచకంగా రెండు నిమిషాల పాటు వౌనం పాటించారు.