జాతీయ వార్తలు

కుట్రదారుల్ని వదలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాంక్, ఫిబ్రవరి 23: పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ‘మన పోరాటం ఉగ్రవాదులపై.. కాశ్మీరీలపై కాదు’ అని వెల్లడించారు. రాజస్థాన్‌లోని టాంక్‌లో శనివారం బీజేపీ ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. కాశ్మీరీ ప్రజల బాధ్యత తనదేదన్న మోదీ ‘కాశ్మీర్‌లో ఉగ్రవాదంపైనే మన యుద్ధం. అంతే తప్ప రాష్ట్ర ప్రజలపై కాదు’ అని స్పష్టం చేశారు. పుల్వామాలో ఉగ్రదాడిని మోదీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని అణచివేయకపోతే ప్రపంచంలో శాంతి స్థాపన సాధ్యం కాదని ఆయన అన్నారు. సాయుధ దళాలపై విశ్వాసం ఉంచాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ‘ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని ప్రపంచం యావత్తూ ఏకాభిప్రాయంతో కోరుకుంటోంది. మనం కూడా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్నాం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న శక్తులకు బుద్ధిచెప్పాల్సిందే’ అని ప్రధాని ఉద్ఘాటించారు. పుల్వామాలో ఈనెల 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెండడం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. పుల్వామా దోషులకు గుణపాఠం తప్పదని మోదీ హెచ్చరించారు. వేర్పాటువాదులకు తగిన బుద్ధి చెబుతామని ఆయన తెలిపారు. దేశం నుంచి ఉగ్రవాదాన్ని సమూలంగా పారదోలి కొత్త రాజకీయాలకు నాంది పలుకుదామని ఆయన పిలుపునిచ్చారు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో గతంలో తాను జరిపిన సంభాషణను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత్- పాకిస్తాన్ మధ్య ఉన్న పలు అంశాలను ఇమ్రాన్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన పేర్కొన్నారు. ‘మీరు క్రికెటర్‌గానే పాక్ ప్రజలకు తెలుసు. ఇప్పుడు దేశ ప్రధానిగా మీపై అనేక బాధ్యతలున్నాయి. ఇరుదేశాల మధ్య ఉన్న వైరం తొలగిపోవాలి. కొట్లాటలు ఆపేద్దాం. పేదరికం, అక్షరాస్యతపైనా మీరు పోరాడాలి’ అని ఇమ్రాన్‌కు తాను చెప్పినట్టు మోదీ వెల్లడించారు. తనతో ఖాన్ అన్న మాటలు మోదీ సభకు తెలిపారు ‘మోదీజీ నేను పఠాన్ కుమారుడ్ని. నేను నిజాలే మాట్లాడతాను. వాటినే ఆచరిస్తాను’ అని ఇమ్రాన్ తనతో అన్నారని ప్రధాని వివరించారు. ఇప్పుడు సరైన సమయం వచ్చింది ఇమ్రాన్ తన మాటపై నిలబడాలని మోదీ విజ్ఞప్తి చేశారు. పుల్వామా ఉగ్రదాడిని ప్రపంచమంతా ఖండిస్తోందని ఆయన వెల్లడించారు. ‘మనపై భవానీ మాత ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. దేశాన్ని, మన సాయుధ దళాలన్నీ ఎవరూ ఏమీ చేయలేరు. ప్రజలందరూ విశ్వాసం ఉంచాలి’ అని ఆయన స్పష్టం చేశారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామన్న ప్రధాని మోదీ ‘శతృవుకు బుద్ధి చెప్పేవరకూ విశ్రమించబోం’ అని ప్రకటించారు. ‘కాశ్మీర్ కోసమే మన పోరాటం. కాశ్మీరీలకు వ్యతిరేకంగా కాదు’ అని మోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదుల వల్ల కాశ్మీరీ యువత ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరులో కలిసి రావడానికి కాశ్మీరీ యువత సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. వారి మద్దతును తీసుకుని ముందుకెళ్దామని మోదీ చెప్పారు. అమర్‌నాథ్ యాత్రికుల రక్షణ బాధ్యత కాశ్మీర్ ప్రజలదేనని ఆయన తెలిపారు. గత ఏడాది అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా జరిగిన ఓ సంఘటనను ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు. అమర్‌నాథ్ యాత్రికులు మిలిటెంట్ల కాల్పుల్లో గాయపడితే ముస్లింలే అక్కున చేర్చుకుని, రక్తదానం చేశారని మోదీ తెలిపారు. తీవ్రవాదంతో కాశ్మీరీ ప్రజలు అనేక కష్టాలుపడుతున్నారని ఆయన వివరించారు. పుల్వామా ఘటన తరువాత దేశంలోని పలుప్రాంతాల్లో ఉంటున్న కాశ్మీరీలపై దాడులు జరుగుతున్నట్టు వార్తల నేపథ్యంలో టాంక్ సభలో మోదీ భరోసా ఇచ్చారు. కాశ్మీరీలకు అండగా ఉంటామని, వారి బాధ్యత తనదేనని అన్నారు.