జాతీయ వార్తలు

పాక్ బృందానికి నిరసన సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్‌కోట్, మార్చి 29: పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడిపై విచారణ నిమిత్తం మంగళవారం ఇక్కడకు వచ్చిన ఐదుగురు సభ్యులుగల పాకిస్తాన్ దర్యాప్తు బృందం నిరసనలు ఎదుర్కోనవలసి వచ్చింది. దర్యాప్తు బృందంలో ఐఎస్‌ఎస్ అధికారి ఉన్నారు. జనవరి 2న పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే. పాక్ దర్యాప్తు బృందం పర్యటనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు నిరసనలు తెలిపాయి. పాకిస్తాన్ సంయుక్త విచారణ బృందంతో జాతీయ భద్రతా ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులతో కలిసి ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. వారి పర్యటనను వ్యతిరేకిస్తూ స్థానికులు నల్లజెండాలు, ప్లకార్డులు చేబూని నిరసన తెలిపారు. జాయింట్ ఇన్విస్టిగేషన్ టీమ్ (జెఐటి) సభ్యుల పేర్లను బ్యానర్లపై రాసి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పాక్ బృందానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జెఐటిని దాడుల జరిగిన నిర్ణీత ప్రాంతంలోకి మాత్రమే అనుమతిస్తామని, మిగిలిన ప్రాంతాల్లో పర్యటనకు అంగీకరించబోమని అధికారులు వెల్లడించారు. ఎయిర్‌బేస్ రేర్‌సైడ్ నుంచి బయలుదేరిన జెఐటి కాన్వాయ్‌ను ‘అప్పర్ దొయబ్’ దగ్గర నిలిపివేశారు. అక్కడి నుంచి మినీబస్‌లో కచ్చా రోడ్డు మీదుగా ప్రయాణించారు. ఆ ప్రాంతంలోనే భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇద్దరు ఏఐఎఫ్ అధికారులు వీడియో తీశారు. భారత్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై పాకిస్తాన్ బృందం దర్యాప్తు జరపడం అన్నది ఇదే తొలిసారి. పంజాబ్ అడిషనల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (కౌంటర్ టెర్రరిజం) మహ్మద్ తహీర్ రాయ్ నేతృత్వంలో ఐఎస్‌ఐ లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారి తన్వీర్ అహ్మద్ జెఐటిలో ఉన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం చూడడానికి మాత్రమే పాక్ టీమ్‌ను అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఎయిర్‌బేస్‌లో మిగతా ప్రాంతాల్లో పర్యటించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని వారన్నారు. దర్యాప్తు బృందం మినీబస్‌ను ప్రత్యేక కమెండోలు అరకిలోమీటరు వరకూ అనుసరించారు. నూతనంగా ఏర్పాటు చేసిన మార్గం గుండా అధికారుల బృందం సరిగ్గా 11.20 నిముషాలకు ప్రవేశించింది.
పాక్ బృందం రాకను నిరసిస్తూ పఠాన్‌కోట్ వైమానిక స్థావరం ఎదుట కాంగ్రెస్, ఆప్ కార్యకర్తలు ప్లకార్టులు పట్టుకుని పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్ భూభాగంపై జరిగిన ఉగ్రవాద దాడిపై దర్యాప్తునకు పాక్ బృందానికి అనుమతి ఇవ్వడం ద్వారా బిజెపి ప్రభుత్వం దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని వారు ఆరోపించారు. పాక్ జెఐటి పర్యటన సిగ్గుచేటని, ఈ ఉదంతం మోదీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిందని ఆప్ ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా మండిపడ్డారు.

చిత్రం పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి తీరును పరిశీలిస్తున్న పాక్ బృందం