జాతీయ వార్తలు

జాట్ల రిజర్వేషన్లకు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, మార్చి 29: ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో జాట్‌లు, మరో అయిదు కులాల వారికి రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు హర్యానా శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 3లోగా తమకు రిజర్వేషన్లు కల్పించని పక్షంలో మరోసారి రాష్టవ్య్రాప్తంగా ఆందోళన చేపడతామని గత నెల పెద్దఎత్తున ఆందోళన జరిపిన జాట్లు హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి రిజర్వేషన్లు కల్పించడానికి ఈ బిల్లును ఆమోదం తెలిపింది. కాగా, జాట్ల రిజర్వేషన్లకు అనుకూలమైనప్పటికీ తమ ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈ రోజు సభకు హాజరు కాలేదు.
రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ శాసన సభలో రెండు బిల్లులు- హర్యానా వెనుకబడిన తరగతుల, ప్రభుత్వ సర్వీసుల్లో, విద్యా సంస్థల అడ్మిషన్లలో రిజర్వేషన్లు) బిల్లు, 2016, హర్యానా వెనుకబడిన తరగతుల కమిషన్ బిల్లు, 2016ను ప్రవేశపెట్టగా, సభ వాటిని ఏకగ్రీవంగా ఆమోదించింది. వెనుకబడిన తరగతుల బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సిల రిజర్వేషన్లకు రాజ్యాంగపరమైన హోదా కల్పించడానికి హర్యానా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల బిల్లును తీసుకువచ్చారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ 31బి అధికరణంలో ఈ చట్టాన్ని చేర్చాలని హర్యానా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది.
వెనుకబడిన తరగతుల్లో కొత్తగా సి-కేటగిరీని ఏర్పాటు చేయడం ద్వారా జాట్లు, మరో అయిదు కులాలు జాట్ సిక్కులు, రోర్‌లు, బిష్ణోయిలు, త్యాగిలు, ముల్లా జాట్‌లు/ ముస్లిం జాట్‌లకు రిజర్వేషన్లు కల్పించడానికి ఈ బిల్లును ప్రతిపాదించారు. ప్రభుత్వ, ప్రభుత్వ సహాయంతో నిడిచే విద్యా సంస్థల్లో, అలాగే మూడవ, నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగాల్లో జాట్‌లు, ఇతర అయిదు కులాలవారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఒకటవ, రెండో తరగతి ఉద్యోగాల్లో బిసి-సి కేటగిరీలోని జాట్లు, ఇతర అయిదు కులాల వారికి 6 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కూడా ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. అలాగే ఒకటవ, రెండవ కేటగిరీ ఉద్యోగాల్లో బిసి-ఎ, బిసి-బి కేటగిరీలకు రిజర్వేషన్లను వరసగా పదినుంచి 11 శాతానికి, 5 నుంచి ఆరు శాతానికి పెంచడానికి కూడా దీనివల్ల వీలవుతుంది. అలాగే క్లాస్ 1, 2 కేటగిరీల ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుబడిన వర్గాల వారికి రిజర్వేషన్ల శాతాన్ని ఇప్పుడున్న 5 శాతంనుంచి 7 శాతానికి పెంచాలని బిల్లులో ప్రతిపాదించారు. కాగా, గవర్నర్ ప్రసంగం పాఠం కాపీలను చించివేసినందుకు ఆరు నెలలపాటు సస్పెండయిన తమ పార్టీకి చెందిన ముగ్గురు శాసనసభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న 15 మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ మంగళవారం సభను బాయ్‌కాట్ చేసింది.

చిత్రం జాట్లకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును హర్యానా అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం పొందడంతో ముఖ్యమంత్రి మనోహల్ లాల్ ఖట్టార్‌కు అభినందనలు తెలుపుతున్న జాట్ నేతలు