జాతీయ వార్తలు

అదో స్వీయ విధ్వంసకుల కూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మహాకూటమిపై కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం ఇక్కడ నిప్పులు చెరిగారు. స్వీయ విధ్వంసకులందరూ మహాకూటమి ఏర్పాటు చేసుకున్నారని ఆయన విమర్శించారు. అలాగే ప్రత్యర్థుల కూటమిగా జైట్లీ అభివర్ణించారు. దేశ ప్రజలందరూ నరేంద్ర మోదీనే రెండోసారి గెలిపించాలని నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏకే జనం పట్టం కడతారని ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికల్లో మోదీని ఎదుర్కొనే ధైర్యం లేక కూటముల పేరుతో ప్రజల ముందుకు వస్తున్నారని కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీపై జైట్లీ దుమ్మెత్తిపోశారు. మహాకూటమిలో ఒకరంటే ఒకరికి పడడదని ఆ పార్టీలన్నీ ఒకప్పుడు కొట్టుకున్నవేనని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజలకు మహాకూటమి ఇస్తున్న హామీలేమిటి? అని ఆయన నిలదీశారు. ‘అదో స్వీయ విధ్వసంకారులు, ప్రత్యర్థుల కూటమి. బీజేపీ, ఎన్‌డీఏను వ్యతిరేకించడమే వారి పని’అని ఆర్థిక మంత్రి విరుచుకుపడ్డారు. కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారు? మున్ముందు దీనిపైనే కొట్లాటలు మొదలవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేనిమీద పోరాడాలి, ఏ సమస్యపై ముందుకెళ్లాలన్న స్పష్టతే కూటమిలోలేదని ఆయన పేర్కొన్నారు. ఒకరంటే ఒకరికి పడదని, అలాంటి వారంతా ఫ్రంట్‌ల పేరుతో జనాన్ని మోసం చేయడానికి వస్తున్నారని జైట్లీ విమర్శించారు.