జాతీయ వార్తలు

భారత సైనికుల కాల్పుల్లో ఆరుగురు పాక్ సైనికులు మృతి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాశ్మీర్‌లోని పౌర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ జరుపుతున్న దాడులపై భారత్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తోంది. ఆధీన రేఖ ప్రాంతంలో గత వారంరోజులుగా జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఆరుగురు పాకిస్తాన్ సైనికులు మరణించారని సైనిక వర్గాలు తెలిపాయి. ‘మా దాడుల్లో ఆరుగురు పాకిస్తాన్ సైనికులు మరణించారు. రజౌరీ సెక్టార్‌లోని పాకిస్తాన్ కమ్యూనికేషన్‌లను వినడం ద్వారా మేము ఈ విషయాన్ని ధృవీకరించుకున్నాం’అని వివరించాయి. ఈ ప్రాంతంలోని పాకిస్తాన్ స్థావరాలపై 105 శతఘు్నలు,విజయంత్ ట్యాంకర్లు, బోఫోర్స్ 52 తుపాకులను నేరుగానే గురిపెట్టి ఉంచిందని తెలిపాయి. జైషే మొహమ్మద్ స్థావరాలను భారత వైమానిక దళం ఇటీవల ధ్వంసం చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడుతోందని, గత రెండు నెలల్లో 450 సందర్భాల్లో ఈ ఉల్లంఘనలకు పాల్పడిందని సైనిక వర్గాలు వెల్లడించాయి.