జాతీయ వార్తలు

అసమ్మతి సెగల మధ్య కాంగ్రెస్, బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, మార్చి 12: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ తరఫున టిక్కెట్లను ఆశించి ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఈ రెండు పార్టీలు అభ్యర్థుల ఖరారు విషయమై తలమునకలై ఉన్నాయి. రాజస్థాన్‌లో 25 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఇందులో 23 సీట్లను 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. బీజేపీకి చెందిన పది మంది సిటింగ్ ఎంపీలు తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. వీరికి టిక్కెట్లు ఇవ్వద్దని పార్టీ కార్యకర్తలు బీజేపీ అధిష్ఠానంపై వత్తిడి తెస్తున్నారు. 13 నుంచి 15 సీట్లలో సిటింగ్ ఎంపీలకే బీజేపీ టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ సిటింగ్‌లకు ఇచ్చేందుకు ఎటువంటి ఇబ్బందులు లేవని పార్టీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ చెప్పారు. కొంత మంది సిటింగ్ ఎంపీలకు టిక్కెట్లు దక్కకపోవచ్చన్నారు. సామాజిక వర్గాలు, పార్టీ కార్యకర్తల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని కొన్ని చోట్ల కొత్త వారికి టిక్కెట్లు ఇస్తామన్నారు. జైపూర్ సీటు నుంచి రామచంద్రన్ బోహ్రా గత ఎన్నికల్లో 5.39 లక్షల ఓట్లతో గెలచారు. తన స్థానాన్ని నిలుపుకునేందవుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సీటుకు మాజీ ఎమ్మెల్య దియా కుమారి ప్రయత్న్తిన్నారు. జైపూర్‌నగరంలో రెండు లోక్‌సభ సీట్లు ఉన్నాయి. జైపూర్ సిటీ, జైపూర్ రూరల్ సీట్లు ఉన్నాయి. జైపూర్ రూరల్ నుంచి కేంద్ర సమాచార శాఖ ఉప మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాథోర్, కుమారి ఇద్దరూకూడా రాజపుత్ర సామాజికవర్గానికి చెందిన వారు. రెండు లోక్‌సభ సీట్లలో రాజపుత్రులనే నామినేట్ చేసేందుకు పార్టీ విముఖత చూపుతోంది. దివ్వకుమారి గతంలో 2013 నుంచి 2018 మధ్య సవామీదోపూర్ అసెంబ్లీ సీటుకు ప్రాతినిధ్యం వహించారు. శ్రీగంగానగర్‌లో కూడా సిటింగ్ ఎంపీకి టిక్కెట్‌ను నిరాకరించే అవకాశం ఉంది. కాగా బర్మర్ లోక్‌సభ సీటుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, బీజేపీ మాజీ సీనియర్ నేత జశ్వంత్‌సింగ్ తనయుడు మనే్వంద్ర సింగ్ పోటీలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే చేతిలో ఓటమి చెందారు. రాష్టమ్రుఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్ తనయుడు కూడా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉలీళ్లూరుతున్నారు.