జాతీయ వార్తలు

నాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్, సయ్యద్ సుజ 2014 ఎన్నికల్లో ఈవీఎంల ట్యాపరింగ్ జరిగిందని చేసిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ తనపై తీవ్రమైన ఆరోపణలు చేసిన సీనియర్ నాయకుడు కపిల్ సిబల్, సయ్యద్ సుజపై దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణలపై కపిల్ సిబల్, సయ్యద్ సుజపై పరువు నష్టం దావా వేస్తానని కిషన్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల సంఘం సైతం ఈవీఎం ట్యాపరింగ్ ఆరోపణలపై నిజానిజాలు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు ఇతర దేశాల నుంచి బెదిరింపుల కాల్స్ వస్తున్నాయని ఆయన అన్నారు.
పార్లమెంట్‌కు పోటీ
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని కిషాన్‌రెడ్డి చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపినట్టు చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇద్దరి అభ్యర్థుల పేర్లను ఇవ్వాలని అమిత్ షా సూచించారని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. 16 మంది లోక్‌సభ సభ్యులను గెలిపిస్తే ఢిల్లీలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యమయ్యే పనేనా? అని ఆయన ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ‘బి’ టీముగా టీఆర్‌ఎస్ పార్టీ మారిందని విమర్శించారు. అందులో భాగాంగానే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానన్నారని ఆయన స్పష్టం చేశారు. ఏ లోక్‌సభ స్థానం నుంచి పోటీ అనేది పార్టీ అదిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.