జాతీయ వార్తలు

ఓటే మీ ఆయుధం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, మార్చి 12: ‘‘మీ ఓటే మీ ఆయుధం.. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుదోవ పట్టకండి’’ అంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మంగళవారం నాడిక్కడ ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల సమర భేరీ మోగించారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్టమ్రైన గుజరాత్‌లోనే ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టిన తర్వాత గాంధీనగర్‌లో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో తొలిసారిగా ప్రసంగించిన ప్రియాంక- ప్రస్తుత దేశ స్థితిగతులపై తీవ్ర ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రేమ, సామరస్యం, సౌభ్రాతృత్వమే పునాదులుగా భారతదేశం ఆవిర్భవించింది, కాని ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇందుకు విరుద్ధంగా, బాధ కలిగించేలా ఉన్నాయని అన్నారు. దేశంలోని కీలక వ్యవస్థలు ధ్వంసం అవుతున్నాయని, సర్వత్రా ద్వేషం ప్రబలిపోతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీకూ నాకూ దేశాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మరొకటి లేదు.. దేశంకోసం పనిచేద్దాం.. కలిసికట్టుగా ముందుకు సాగుదాం’’ అని పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల సమర భేరీ మోగిన నేపథ్యంలో మరింత పదునైన తీరిలోనే ప్రియాంక తన ప్రసంగాన్ని కొనసాగించిన ప్రియాంక ‘‘మీ విలువైన ఓటును ఆయుధంగా ఉపయోగించండి.. ఎవరి మాటలకూ మోపోయి తప్పుదోవ పట్టకండి’’ అని అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంతో మోదీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టిన ప్రియాంక, కోట్లాది మంది భారతీయులకు ఉపాధి కల్పిస్తామన్న హామీని కేంద్రం నిలబెట్టుకోలేక పోయిందని అన్నారు. ప్రస్తుత ఎన్నికలు అత్యంత కీలకమైనవని.. దానిపై దృష్టి పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఆమె, ‘‘అసలు ఈ ఎన్నిక ఉద్దేశ్యమేమిటో అర్థం చేసుకోండి.. మీరు ఎవరిని ఎన్నుకోబోతున్నారో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి.. ఎందుకంటే ఇది మీరు మీ భవితను ఎన్నుకునే తరుణం.. నిరుపయోగ అంశాలను పట్టించుకోకండి.. దేశ భవితపైనే దృష్టి పెట్టండి’’ అని అన్నారు. యువతకు ఏ విధంగా ఉపాధి లభిస్తుంది.. మనం ఏ విధంగా ముందుకు వెళ్లగలుగుతాం.. మహిళలకు భద్రతను ఏ విధంగా కల్పించగలుగుతాం.. రైతులను ఆదుకునే మార్గాలేమిటి? అన్న అంశాలే ప్రస్తుత ఎన్నికల్లో కీలకమని, వాటిపైనే ప్రజలు దృష్టి పెట్టి తమ భవిష్యత్తును, దేశ భవితను నిర్దేశించాలని అన్నారు. ప్రేమ, సామరస్యంతో దేశంలోని ద్వేష భావాలను తరిమికొట్టాలని, ఈ ఉన్నత భావనలే భారత లక్ష్యమని ప్రియాంక అన్నారు. రైతులు, యువతే దేశ నిర్మాణం కోసం అహరహం శ్రమించారని, దేశాన్ని రక్షించేది కూడా వీళ్లేనని ప్రియాంక అన్నారు.

చిత్రాలు.. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీ నుద్దేశించి ప్రసంగిస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. *ర్యాలీకి తరలివచ్చిన జనం.