జాతీయ వార్తలు

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన హీరో మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: అసాధ్యాన్ని సుసాధ్యం చేసే హీరో ప్రధాని మోదీ అనే నినాదంతో జనంలోకి వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. హిందీ బెల్ట్‌లో మోదీ హై తోవ ముంకీన్ హై అనే నినాదాన్ని ఇవ్వనున్నారు. వచ్చే ఎన్నికల్లో జనంలోకి వెళ్లేందుకు బీజేపీ ప్రచారంలో అస్త్ర శస్త్రాలను తయారు చేసుకుంటోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించనున్నదని ఆయన చెప్పారు. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. మోదీ గత ఐదేళ్లలో అహర్నిశలు అభివృద్ధి కోసం పనిచేశారన్నారు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడం మోదీకే సాధ్యమన్నారు. గత ఐదేళ్లలో అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. మోదీ బలమైన నేత అన్నారు. ప్రతి భారతీయుడు ఈ రోజు మోదీ గొప్పతనాన్ని, పనితీరు, విశిష్టతను గుర్తించారన్నారు. అనేక అంశాలపై మోదీ ఇంత త్వరగా నిర్ణయాలు తీసుకోవడంపై ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయన్నారు. ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందే దేశాల్లో భారత్ అగ్రగామిగా ఉందన్నారు. దేశ రక్షణకు రాజీపడకుండా 2016, 2019లో వైమానిక దాడులను నిర్వహించి తన శక్తిని చాటిందన్నారు. ఈబీసీలకు పదిశాతం కోటాను కేటాయించా మన్నారు. దీని వల్ల ఆర్థికంగా వెనకబడిన పేదలు లాభపడుతారని చెప్పారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదును జమచేసి వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. వస్తు సేవా పన్నును దేశ వ్యాప్తంగా అమలు చేస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. ఆరోగ్య బీమా పథకం ద్వారా పేదలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.