జాతీయ వార్తలు

అది నెహ్రూ తప్పిదమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: ఐక్యరాజ్యసమితిలో చైనా కు శాశ్వత సభ్యత్వం లభించే విధంగా సమర్థించిన నేత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మనదేశానికి ఈ స్థానం దక్కేటట్లు ప్రయత్నించకుండా చైనాకు లభించేందుకు ప్రయత్నించిన పాపం నెహ్రూదేనన్నారు. ప్రధాని నరేంద్రమోదీ బలమైన నేత, బలహీనమైన ప్రధాని అని చైనా ప్రధాని జింగ్‌పింగ్‌కు భయపడుతున్న నేత అని ఎఐసీసీ అధ్యక్షుడు రాహల్ గాంధీ విమర్శలు చేసిన కొద్దిసేపటికే అరుణ్ జైట్లీ ఘాటుగా స్పందించారు. పాక్‌కు చెందిన ఉగ్రవాది మసూద్ అజార్‌ను గ్లోబల్ ఉగ్రవాదికి ప్రకటించాలన్న డిమాండ్‌ను చైనా అడ్డుకున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. కాశ్మీర్, చైనా విషయంలో తప్పులు చేసిన ఘనత నెహ్రూదేనన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ 1955 ఆగస్టు2వ తేదీన ముఖ్యమంత్రులకు రాసిన లేఖలోని అంశాలను ప్రస్తావించారు. చైనాలో ఐరాసలోకి తీసుకోవాలని, భధ్రతా మండలిలో తీసుకోరాదని కోరింది. భారత్‌ను భధ్రతా మండలిలో తీసుకోవాలని అమెరికా కోరింది. కాని ఈ అభిప్రాయాన్ని అంగీకరించరదాని, చైనా లాంటి గొప్ప దేశానికి భద్రతామండలిలో స్థానం లేకపోతే ఎలా అని నెహ్రూ లేఖలో రాశారన్నారు. ఈ వివరాలను జైట్లీ ట్వీట్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే నిజమైన పాపానికి ఎవరు ఒడిగట్టారని ఆయన ప్రశ్నించారు. గత నెల 14వ తేదీన పుల్వామా వద్ద జైషేమహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాది దాడి ఘటనలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి విదితమే. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని జైషే సంస్థను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ముద్రవేయాలని భారత్ భద్రతామండలిపై వత్తిడి తేస్తోంది. కాని చైనా మాత్రం వ్యతిరేకించిన విషయం విదితమే.