జాతీయ వార్తలు

అధికారమిస్తే అల్లకల్లోలమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధిపూ (అసోం), మార్చి 29: అసోం శాసనసభ ఎన్నికల్లో బిజెపిని తిరస్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బిజెపిని అధికారంలోకి తీసుకువస్తే రాష్ట్రాన్ని నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయం నుంచో లేక ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) నుంచో పరిపాలిస్తారని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా బిజెపి నాయకులు రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తారని, కాంగ్రెస్ పాలనలో నెలకొల్పిన శాంతియుత వాతావరణానికి తూట్లు పొడుస్తారని రాహుల్ అన్నారు. కర్బీ జిల్లాలోని ధిపూలో మంగళవారం కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ హెచ్చరిక చేశారు. ‘ప్రతి ఒక్కరూ తమ భాషా, సంస్కృతుల గురించి ఆలోచించి తదనుగుణంగా వ్యవహరించాలని, దేశంలో ఎవరూ అణచివేతకు గురికాకూడదని మేము కోరుకుంటున్నాం.
బిజెపివాళ్లు ముందు మీ రాష్ట్రంలో ఓట్లు అడుగుతారు. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఇక్కడినుంచి కాకుండా నాగ్‌పూర్ నుంచో లేక పిఎంఓ నుంచో పరిపాలిస్తారు’ అని రాహుల్ చెప్పారు. బిజెపి ఎక్కడికి వెళ్లినా హింసను సృష్టించడం, శాంతికి తూట్లు పొడవడం తప్ప మరేమీ ఒరగబెట్టదన్నారు. గత పదేళ్లలో ఎటువంటి హింస లేకుండా శాంతియుతంగా ఉన్న హర్యానాలో బిజెపి అధికార పగ్గాలు చేపట్టిన కొద్ది నెలలకే అక్కడ జాట్లు, జాట్ యేతర సామాజికవర్గ ప్రజల మధ్య హింసాకాండ చెలరేగడమే ఇందుకు తాజా నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ‘ఇంతకుముందు గుజరాత్‌లో ఏమి జరిగిందో మీరు చూశారు. బిహార్ శాసనసభ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో హింసను సృష్టించేందుకు బిజెపి ప్రయత్నించింది. ఇప్పుడు అస్సాంలో కూడా హింసను వ్యాపింప జేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనలను, భావజాలాన్ని దేశమంతటా రుద్దాలని చూస్తున్న బిజెపి నాయకులు మీ గురించి గానీ, మీ రాష్ట్రం గురించి గానీ ఏమాత్రం ఆలోచించరు’ అని రాహుల్ స్పష్టం చేశారు.
పనిలో పనిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆయన మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తప్పుడు హామీలతో మోదీ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో దేనినీ నెరవేర్చకపోవడంతో బిహార్ శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పారని రాహుల్ అన్నారు.

చిత్రం అసోంలోని ధిపూలో మంగళవారం కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అభ్యర్థులను పరిచయం చేస్తున్న రాహుల్ గాంధీ.