జాతీయ వార్తలు

తృణమూల్ వైపే మైనార్టీల మొగ్గు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 17: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి చెక్ పెట్టేందుకు మైనార్టీలు తృణమూల్ కాంగ్రెస్‌కే ఓటు వేసే అవకాశాలు కనపడుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో మతపరమైన అల్లర్లను అణచివేయడంలో టీఎంసీ సర్కార్ విఫలమైంది. పైగా టీఎంసీ ప్రభుత్వ తీరుతో మైనార్టీలు మిగతా వర్గాల మాదిరిగానే విసిగిపోయ ఉన్నారు. కాని గత్యంతరం లేక బీజేపీకి ఓటు వేయలేక టీఎంసీవైపే మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో మైనార్టీలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే విధంగా మైనార్టీల ఓట్లున్నాయి. మతతత్వ పార్టీ బీజేపీకి చూస్తూ ఓటు వేయలేమని, బలహీనమైన కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు ఓటు వేసి తమ ఓటు హక్కును వృథా చేసుకోవాలని లేదని ఆల్ బెంగాల్ మైనార్టీ యూత్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ కమజ్రుద్దీన్ చెప్పారు. అందుకే ముస్లింలు టీఎంసీకే ఓటు వేస్తారని అన్నారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కూడా ఇంతవరకు సీట్లను పంచుకోలేదని, ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు ఉంటాయో లేదో తెలియడం లేదని అన్నారు. ఏదిఏమైనా బీజేపీని ఓడించేందుకు ఎన్నికల బరిలో ఉన్న బలమైన లౌకికవాద పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజాతంత్ర భావజాలం ఉన్న పార్టీలకే ఓటు వేసేందుకు ముస్లింలు ఆసక్తిగా ఉంటారని ఖాజీ ఫజల్ రెహమాన్ అనే ఇమామ్ చెప్పారు. నకోడా మసీద్‌కు చెందిన ఇమామ్ షాఫీక్ ఖాస్మీ మాట్లాడుతూ మతతత్వశక్తులకు ముస్లింలు ఓటు వేయరన్నారు. టీఎంసీ సర్కార్ పట్ల తమకు తీవ్ర అసంతృప్తి ఉందని, కాని గత్యంతరం లేదని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో 16 నుంచి 18 లోక్‌సభ సీట్లలో ముస్లింలు 30 శాతం వరకు ఉన్నారు. సెక్యులర్ పార్టీలకు ముస్లింలు ఒక ఓటు బ్యాంక్. రాయిగంజ్, కుచ్‌బిహార్, బాలూర్ ఘాట్, మాల్డా ఉత్తరం, మాల్డా దక్షిం, ముషీరాబాద్, డైమండ్ హార్బర్, ఉలుబేరియా, హౌరా, బీర్హూమ్, కాంతి, తమ్లక్, జోయానగర్‌లలో ముస్లిం ఓటర్లు ఎక్కువ. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం 2015 తర్వాత రాష్ట్రంలో మతపరమైన అల్లర్లు పెరిగాయ. 2015లో 27 మతపరమైన అలర్లు జరిగాయి. 2017 వచ్చేసరికి ఈ అల్లర్ల సంఖ్య 58కి పెరిగింది. బీజేపీ ప్రేరేపిత దుష్టరాజకీయాల వల్ల రాష్ట్రంలో మతపరమైన అల్లర్లు నమోదయ్యాయి.
ముస్లింల సమావేశంలో మమతా బెనర్జీ (ఫైల్ ఫొటో)