జాతీయ వార్తలు

బీజేపీ వ్యతిరేక ప్రభంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 17: ‘జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ప్రభంజనం వీస్తోంది.. ప్రధాని నరేంద్ర మోదీ విశ్వసనీయతను కోల్పోయారు’ అని ఎన్సీపీ అధ్యక్షుడు, సీనియర్ నేత శరద్ పవార్ విమర్శించారు. ఆయన ఇక్కడ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బీజేపీ ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఈ రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీ పాలనతో విసిగి వేసారి చిత్తుగా ఓడించారు. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోవడంతో దేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీల్లో ఊపు వచ్చింది. ఈ మూడు రాష్ట్రాల్లో మోదీ విశేషంగా ప్రచారం చేసినా పార్టీ ఓటమి ఆపలేకపోయారు. గ్రామీణ భారతంలో రైతాంగ సంక్షోభం తీవ్రంగా ఉంది. పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. రైతాంగానికి కేంద్రం చేసిందేమీ లేదు.. ఆత్మహత్యలు పెరిగాయి అని తీవ్రంగా విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు పెరిగినప్పుడు తాను గతంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేత దేశంలోని వివిధ ప్రాంతాల్లో యాత్రలు నిర్వహించి రైతులకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకున్నామని అన్నారు. తాను ఇచ్చిన ప్రతిపాదనల మేరకు అప్పటి కేంద్రం రైతులకు మేలు చేకూర్చే విధంగా రూ.70వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందని అన్నారు. మహారాష్టల్రో బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది.. రైతులకు రూ.34వేల కోట్ల రుణాలను మాఫీ చేసినా ఇంతవరకు రైతులకు ఒక్కపైసా అందలేదు.. మహారాష్టల్రో గత నాలుగున్నరేళ్లలో 11,998 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చేప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. 2014 ఎన్నికల్లో మోదీ నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామని వాగ్దానం చేశారు. కాని ఈ రోజు ప్రజలను మోసం చేసి ఆ మాట మాట్లాడడం లేదని అన్నారు. పెద్దనోట్ల రద్దువల్ల దేశంలో ఆర్థిక విధ్వంసం జరిగింది.. దాదాపు వంద మంది ప్రజలు మరణించారు.. 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు. పెద్దనోట్ల రద్దు అనాలోచిత చర్య.. దేశ ఆర్థిక శక్తిని అది నిర్ణయం బలహీనపరిచిందని విమర్శించారు. రాఫెల్ మంచి ఎయిర్ క్రాఫ్ట్ అని.. యూపీఏ హయాంలోనే ఎన్నికలవల్ల దీనిపై ఒక నిర్ణయం తీసుకోలేకపోయామని అన్నారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ధరను పెంచడం.. పారదర్శకత లోపించడం.. జవాబుదారీతనం లేకపోవడం.. రాఫెల్ ధరను రూ.1660 కోట్లుగా నిర్ణయించడం అన్నీ బీజేపీ దివాళాకోరు విధానాలకు నిదర్శనమని అన్నారు. ద్రవ్యోల్బణం తీవ్రస్థాయిలో ఉంది. రాఫెల్ ఒప్పందానికి రెండు వారాలకు ముందే అనిల్ అంబానీ సంస్థతో డీల్ ఖరారు చేసుకోవడం దారుణమని అన్నారు. ఈ సంస్థ నాగ్‌పూర్‌లో స్థలాన్ని సేకరించింది.. ఇంకా ఫ్యాక్టరీ, ఇతర వౌలిక సదుపాయాలు ఈ సంస్థకు లేవని అన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖలో రాఫెల్ పత్రాలు మాయం కావడం దారుణం.. ఈ పత్రాలకే భద్రత లేకపోతే, దేశానికి ఎటువంటి భద్రతను బీజేపీ కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.