జాతీయ వార్తలు

పాక్ కాల్పులు: జవాన్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, మార్చి 18: నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వద్ద పాక్ దళాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో కాల్పులకు తెగబ్డారు. పాక్ కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందాడు. మరో నలుగురు గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఎలాంటి కవ్వింపుచర్యలు లేకుండా పాక్ సైనికులు కాల్పులకు దిగారు. సుందెర్‌బనీ సెక్టార్ మోర్చల్ బాంబులు, చిన్న ఆయుధాల మోతతో దద్దరిల్లింది. అయితే భారత దళాలు గట్టిగానే ప్రతిఘటించినట్టు రక్షణశాఖ ప్రతినిధి వెల్లడించారు. పాక్ కాల్పుల్లో గాయపడ్డ జవాన్ కరంజిత్ సింగ్ మృతి చెందాడని ఆయన తెలిపారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ప్రతినిధి చెప్పారు. మృతి చెందిన 24 ఏళ్ల జవాన్ పంజాబ్‌లోని మొగా జిల్లా జనెర్ గ్రామానికి చెందినవాడు. అతడికి తల్లిదండ్రులున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సింగ్‌కు జాతియావత్తూ శ్రద్ధాంజలి ఘటిస్తోందని ఆయన తెలిపారు. ఆదివారం కూడా ఎల్‌ఓసీ వద్ద కాల్పులకు తెగబడ్డ పాక్ రెండోరోజూ తెగబడింది. ఎలాంటి కవ్వింపుచర్యలూ లేకుండానే ఏకపక్షంగా కాల్పులకు దిగిందని ఆయన అన్నారు. సుందేర్‌బనీ సెక్టార్‌లోని కేరీబట్టల్‌లో సోమవారం కాల్పుల వివరణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు ఆయన వెల్లడించారు.