జాతీయ వార్తలు

బీజేపీది ‘కృత్రిమ మెజారిటీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/పనాజీ, మార్చి 18: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతితో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారి ఊపందుకున్నాయి. బొటాబొటి మెజారిటీతోనే బీజేపీ అధికారం చెలాయిస్తూ వచ్చింది. పారికర్ మృతితో సభలో బీజేపీ బలం 12కు పడిపోయింది. అసెంబ్లీలో అతి పెద్ద పార్టీ తమదేనని కాబట్టి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈమేరకు గవర్నర్ మృదులాసిన్హాకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. అయితే కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించే అకాశాలు కనిపించడం లేదు. గోవాలో ‘కృత్రిమ మెజారిటీ’ని చూపించి కేంద్రం ప్రభుత్వం డ్రామాలాడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. రాజ్యాంగ బద్ధంగా తమనే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. ‘గోవాలో పరిణామాలను ప్రజాస్వామ్య వాదులు, మీడియా గమనిస్తోంది. గవర్నర్లు వాస్తవమేమిటో చూడాలి. న్యాయమూర్తుల్లా సరైన తీర్పును వెలువరించాల్సి ఉంది’అని ఆజాద్ వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఉన్న పార్టీనే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలి. అయితే గోవాలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది. కేంద్రం ఆదేశాల మేరకు కృత్రిమ మెజారిటీని సృష్టించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు సభలో మెజారిటీ ఉందని చెబుతున్నా గవర్నర్ మృదులా సిన్హా పట్టించుకోకపోవడం దారుణమని ఆయన విమర్శించారు. గవర్నర్ అన్న వ్యక్తి గవర్నర్‌గానే పనిచేయాలి తప్ప పార్టీ వ్యక్తిగా వ్యవహరించకూడదని ఆజాద్ అన్నారు. గతంలోనూ తమకు మెజారిటీ ఉందని చెప్పినా పట్టించకోలేది అలాంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కాకూడదని కాంగ్రెస్ సీనియర్ నేత తెలిపారు. గోవాలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ మంచి మెజారిటీ సాధించి ఏకైక పెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని ఆజాద్ జోస్యం చెప్పారు. ‘పారికర్ మృతితో బీజేపీ బలం 11కు పడిపోయింది. మాకు 14 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రకాంత్ కవ్లేకర్ ఉన్నారు. ఆయన నాయకత్వంలోనే గవర్నర్ మృదులాసిన్హాను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు’అని గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. పారికర్ మృతి విషాదమని ఆయన అంటూ ఇన్నాళ్లూ బొటాబొటి మెజారిటీతో బీజేపీ అధికారం చెలాయిస్తూ వచ్చిందని ప్రతిపక్ష నేత కవ్లేకర్ విమర్శించారు.