జాతీయ వార్తలు

సంప్రదాయాలు తెలుసుకోకుండా ఈ విమర్శలేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పై లక్నో, మార్చి 18: మన భారతదేశం సంప్రదాయాలు, ఆచారాలపై పిసరంతైనా పరిజ్ఞానం లేని విపక్షాలు కొన్ని విషయాలపై అనవసర రాద్ధాంతాలకు దిగుతూ లేనిపోని విమర్శలకు పాల్పడుతున్నారని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు.
ఈ ఏడాది జరిగిన అర్ధకుంభమేళాను కుంభమేళాగా తమ ప్రభుత్వం మార్చడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ ఈ విషయంలో వారికి ఏమాత్రం పరిజ్ఞానం లేదని విమర్శించారు. యూపీ ప్రభుత్వం 2017లో అర్థ కుంభమేళాను కుంభమేళాగా, కుంభ మేళాను మహా కుంభమేళాగా మార్చింది. అలహాబాద్‌లో ఈ ఏడాది జనవరి 15 నుంచి మార్చి నాలుగు వరకు కుంభమేళాను నిర్వహించారు. యమున, గంగ సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో జరిగిన ఈ కుంభమేళాకు 24 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మన సైనికులు పాక్‌లో జరిపిన దాడులను సందేహిస్తూ రుజువులు కావాలంటూ సైనికుల సాహసాన్ని అవమానించేలా మాట్లాడిన విధంగానే కోట్లాది మంది హాజరై తమ భక్తిప్రపత్తులతో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులైన భక్తులను అవమానపరిచేలా అర్థ కుంభమేళాను, కుంభమేళాగా మార్చారంటూ తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో విజయవంతంగా నిర్వహించిన ఈ కుంభమేళాను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ‘ఇది స్వచ్ఛ, సురక్షిత కుంభమేళా’ అని ప్రశంసించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే విపక్షాలు మాత్రం భారత చరిత్ర, సంప్రదాయాలపై కొద్దిగానైనా అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని యోగి విమర్శించారు. కుంభమేళా నిర్వహణలో తమకు మోదీ స్ఫూర్తిగా నిలిచారని, మొదటి నుంచి ఆయన తమకు మార్గదర్శకునిగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేకూర్చారని ఆయన అన్నారు. ఒక పక్క ప్రపంచమంతా ఉగ్రవాద దాడుల భయాన్ని ఎదుర్కొంటుండగా తాము కోట్లాది మంది వచ్చిన కుంభమేళాలో ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక నమ్మకాలతో ముడిపడి ఉన్న ఇంత పెద్ద కార్యక్రమాన్ని యునెస్కో ‘ ఇది మానవత్వాన్ని ప్రతిబింబించే అతి సూక్ష్మ వారసత్వ సంపద’గా అభివర్ణించిందన్నారు. కాగా, రాష్ట్రంలో పశువులు దారితప్పిపోతున్న సమస్యను ఆయన ప్రస్తావిస్తూ ఇది కేవలం వ్యక్తులు సృష్టించిన సమస్య అని, సమాజమే దానికి పరిష్కారాన్ని సైతం కనుగొనాలని అన్నారు. ఇలాంటి పశువులను సంరక్షించడానికి తమ ప్రభుత్వం గోశాలలను నిర్మించాలని యోచిస్తోందని, దాని నిమిత్తం నిధుల సేకరణకు కొన్ని ఎక్జైజ్ వస్తువులు, రోడ్ టోల్ ప్లాజాలు, మండీ పరిషత్‌లకు గో సంరక్షణ సెస్‌ను విధించాలని భావిస్తున్నట్టు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.