జాతీయ వార్తలు

ఎక్కడి నుంచైనా పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, మార్చి 18: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాందీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా లోక్‌సభకు పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, లోక్‌సభ సభ్యుడిగా, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న దిగ్విజయ్ ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సవాల్‌గా మారిన నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కోరిన నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎవరు సవాల్ విసిరినా దాన్ని స్వీకరించి ఎదుర్కొవడమన్నది తన లక్ష్యమని చెప్పిన దిగ్విజయ్ రాహుల్‌గాంధీ కోరితే ఎలాంటి నియోజకవర్గం నుంచైనా పోటీకి సిద్ధమని, ఈ విషయంలో వెనక్కీ తగ్గేదిలేదని స్వష్టం చేశారు. బీజేపీకి కంచుకోటలుగా భావిస్తున్న భోపాల్ లేదా ఇండోర్ లోక్‌సభ సీటు నుంచి దిగ్విజయ్ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇండోర్‌కు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, భోపాల్‌కు అలోక్ సంజార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1984లో చివరిసారిగా ఇండోర్ నుంచి కాంగ్రెస్ గెలుపొందింది. తాలు జనతాపార్టీ ప్రభంజనంలో కూడా విజయం సాధించామని, అలాంటి తాను రాహుల్ కోరితే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని దిగ్విజయ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌కు సవాల్‌లాంటి సీటునే ఎంచుకోవాలని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కోరడాన్ని తన సత్తాను ఆయన గుర్తించినట్లుగానే భావిస్తున్నానని దిగ్విజయ్ అన్నారు. రాష్ట్రంలోని 29 లోక్‌సభ స్థానాలకు నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలో గరిష్ఠ సంఖ్యలో లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తున్న దృష్ట్యా సీనియర్ నేతలు దీన్ని సవాల్‌గా తీసుకుని ఎన్నికల బరిలోకి దిగాలని కాంగ్రెస్ అధిష్ఠానం సూచించింది. కేవలం సునాయాసంగా విజయం సాధించే సీట్లు కాకుండా, ప్రత్యర్థి పార్టీ బలంగా ఉన్న స్థానాలను ఎంచుకొని సీనియర్ నేతలు పోటీ చేయాలని స్పష్టం చేసింది.