జాతీయ వార్తలు

పారికర్‌కు అంతిమ వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ: అనారోగ్యంతో కన్నుమూసిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌కు సోమవారం సైనిక లాంచనాలతో అంత్యక్రియలు జరిగాయి. చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం పారికర్(63) కన్నుమూశారు. ఎలాంటి పదవుల్లో ఉన్నప్పటికీ ఆయన అత్యంత నిరాడంబర జీవితాన్ని గడిపేవారు. గోవా ప్రజలంతా ఆయనను ‘సామాన్యుడి’గా పేర్కొంటారు. ఆయన మృతి బీజేపీ కార్యకర్తలు, అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. సోమవారం జరిగిన అంత్యక్రియలకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. తొలుత ప్రజల దర్శనార్థం పారికర్ పార్ధీవదేహాన్ని పనాజీలోని బీజేపీ ఆఫీసుకు తరలించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల వందలాది మంది తరలివచ్చి ప్రియతమనేతకు ఘన నివాళి అర్పించారు. పారికర్ భౌతికకాయంపై మూడు రంగుల జాతీయ పతాకాన్ని కప్పారు. సీఎం మృతదేహాన్ని అలంకరించిన ఓ వాహనంపై ఉంచి పౌలాలోని అనధికార నివాసం ‘డోనా’నుంచి అంతిమయాత్ర బయలుదేరింది. అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మిరామర్ బీచ్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
పారికర్ మరణవార్త తెలిసిన వెంటనే ఆదివారం రాత్రే కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ సహా పలువురు మంత్రులు పనాజీకి తరలివచ్చారు. అంతిమసంస్కారానికి ముందు కళాఅకాడెమీకి వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు.
గోవా ఆర్చిబిషప్ ఫాదర్ ఫ్లిపే నేరి ఫెర్రావో, గోవా సొసైటీ ఆఫ్ డయాసిస్ కార్యదర్శి ఫాదర్ జెఫ్రినో డిసౌజా కళాఅకాడెమీకి వచ్చి ప్రార్థనలు చేశారు. దావూదీ బోహ్రా సామాజిక వర్గానికి చెందిన అనేక మంది శ్రద్ధాంజలి ఘటించారు. పారికర్ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోతో కూడిన హోర్గిండ్‌ను కళాభవన్ ఎదుట బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసింది. నగంరలోని వాణిజ్య కూడళ్లయిన మపౌసా, పనాజీలు మూగబోయాయి. సాయంత్రం 4 గంటలకు మొదలైన పారికర్ అంతిమయాత్రం ఐదున్నర వరకూ సాగింది. మనోహర్ పారికర్ గత ఏడాది ఫిబ్రవరి నుంచి పాన్‌క్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. గోవా తొలి ముఖ్యమంత్రి దయానంద్ బందోద్కర్ అంతిమసంస్కారాలు జరిగిన చోటే పారికర్‌కు నిర్వహించారు.
ప్రధాని శ్రద్ధాంజలి
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. పనాజీలోని కళాఅకాడెమీకి వచ్చి పారికర్ భౌతికకాయానికి ప్రధాని శ్రద్ధాంజలి ఘటించారు. పారికర్ కుటుంబ సభ్యులను మోదీ ఓదార్చారు. రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ మాజీ రక్షణ మంత్రి దివంగత పారికర్‌కు ఘన నివాళి అర్పించారు. అంతకు ముందు రాజధాని ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం గోవా సీఎం మృతికి తీవ్ర సంతాపం తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గోవాలో జరిగిన పారికర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రజల సందర్శనార్ధం దివంగత సీఎం పార్థీవ దేహాన్ని కళాఅకాడెమీలో ఉంచారు. అమిత్ షా అక్కడకు చేరుకుని ఘన నివాళి అర్పించారు.
చిత్రం.. పారికర్ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రధాని మోదీ