జాతీయ వార్తలు

తొలి లోక్‌పాల్ నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్‌ను తొలి లోక్‌పాల్‌గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి నిర్మూలనకు లోక్‌పాల్ చర్యలు తీసుకుంటారు. లోక్‌పాల్‌లో సహస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) మాజీ చీప్ అర్చన రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ జైన్, మహేంధ్ర సింగ్, ఇంద్రజిత్ గౌతమ్‌లను సభ్యులుగా నియమించారు. జస్టిస్ దీలీప్ బీ భోసలే, జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతి, జస్టిస్ అభిలాష కుమారి, జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠీని న్యాయ విభాగ సభ్యులుగా నియమించారు. లోక్‌పాల్‌ను అవినీతి నిరోధక అంబుడ్స్‌మెన్‌గా వ్యవహరిస్తారు. లోక్‌పాల్ నియామకాన్ని సామాజిక కార్యకర్త, సర్వోదయ నాయకుడు అన్నా హజారే స్వాగతించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్రమంత్రిమండలి లోక్‌పాల్ సభ్యుల పేర్లను రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. లోక్‌పాల్‌గా నియమితులైన జస్టిస్ ఘోష్ వయస్సు 66 సంవత్సరాలు. ఆయన 2017 మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల సంఘం కమిషన్ సభ్యుడిగా పనిచేస్తున్నారు. కాగా లోక్‌పాల్ సభ్యుల నియామకాన్ని ఖరారు చేసే సమావేశాన్ని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే బహిష్కరించిన విషయం విదితమే.

చిత్రం.. చంద్ర ఘోష్‌