జాతీయ వార్తలు

మరో మోసానికి తెరతీసిన మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: ఓటమి ఖాయం కావటంతో బీజేపీ దేశ ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త కొత్త నినాదాలు ఇస్తోంది.. అయితే ఈ నినాదాలను ప్రజలు విశ్వసించటం లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవాలా ప్రకటించారు. మంగళవారం ఆయన ఏఐసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చౌకీదార్ దొంగతనం గురించి దేశమంతా చర్చించుకుంటోందని అన్నారు. మోదీబాబా ఆయన నలభై మంది మంత్రులు తమ పేర్ల చివర్లో చౌకీదార్ అని రాసుకుని దేశ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆయన ఆరోపించారు. మోదీబాబా నలభై మంది దొంగలు చేస్తున్న మోసాన్ని ప్రజలు గ్రహించాలని సుర్జేవాలా చెప్పారు. తమ ప్రభుత్వం, పథకాలను ప్రజలకు విక్రయించేందుకు బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.. మోదీ వైఫల్యాలను దాచేందుకు మాటమాటకు ప్రభుత్వానికి కొత్త రంగు వేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ‘80 లక్షల కోట్ల నల్లధనాన్ని వంద రోజుల్లో స్వదేశానికి తెస్తాం.. అందుకే నన్ను గెలిపించాలి’ అని 2013లో కోరిన మోదీ ‘ప్రతి ఓటరు బ్యాంకు ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తాను’ అని హామీ ఇచ్చారు. మంచి రోజులు వస్తున్నాయని 2014లో ఆశ చూపించిన మోదీ 2015లో ‘అందరి వెంట అందరి అభివృద్ధి’ అనే నినాదం ఇచ్చాడని సుర్జేవాలా ఎద్దేవా చేశారు. 2016లో కొత్త భారతదేశాన్ని నిర్మిస్తామని ప్రకటించిన నరేంద్ర మోదీ 2017లో ‘నా దేశం మారుతోంది’ అంటూ కొత్త నినాదం ఇచ్చి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని దుయ్యబట్టారు. 2018లో ‘పరిశుభ్ర మనస్సు.. సరైన అభివృద్ధి’ అంటూ నరేంద్ర మోదీ కొత్త నినాదంతో దేశ ప్రజలను మరోసారి మభ్య పెట్టేందుకు ప్రయత్నించారని ఆయన విమర్శించారు. 2019లో ‘నేను కూడా చౌకీదారునే’ అంటూ నరేంద్ర మోదీ వినూత్న నినాదంతో ప్రజల వద్దకు వెళుతున్నారంటూ సుర్జేవాలా ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ ఓటమి భయంతో తన నినాదాలను మారుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించటం ద్వారా విజయం సాధించేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. పది లక్షల రూపాయల విలువ చేసే సూట్ ధరించే నరేంద్ర మోదీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో దొరికిపోయారని అన్నారు. మోదీ ప్రభుత్వం దేశంలోని బీద ప్రజలను దోచి డబ్బున్న వారికి పంచి పెడుతున్నారంటూ సుర్జేవాలా ఆరోపణలు కురిపించారు. బడా పారిశ్రామికవేత్తల రుణాలు మాఫీ చేసిన నరేంద్ర మోదీ చౌకీదార్ ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఆలీబాబాలాంటి నరేంద్ర మోదీ తన పేరు చివర్న చౌకీదార్ అనేది పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం విద్యార్థులు, యువకులు, రైతులు, కార్మికులు, మహిళలు, చిన్న వ్యాపారస్తులను దోచుకుంటోందని దుయ్యబట్టారు. బీజేపీ ఖాతాలో అకస్మాత్తుగా కోట్లాది రూపాయలు జమ చేయించిన మోదీ ఈసారి ప్రజలను మోసం చేయలేరని ఆయన చెప్పారు. ‘దేశంలోని ఒకే చౌకీదార్ దొంగ.. మిగతా చౌకీదారులంతా మంచివారే’’ అంటూ సుర్జేవాలా విలేఖరుల సమావేశం ముగించారు.