జాతీయ వార్తలు

టీ అమ్మే వ్యక్తి ఐదేళ్లలో కాపలాదారుడయ్యారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 19: టీ అమ్మేవ్యక్తి కాపాలాదారుడయ్యారు. ఇదేనా ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్ల పాలనలో వచ్చిన మార్పు అని బీఎస్పీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు. ఈ నెల 31 నుంచి నేనూ కాపాలాదారుడినే అనే నినానాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని బీజేపీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాయావతి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో మోదీ చాయివాలా అని ప్రచారం చేశారు. ఈ రోజు చౌకీదార్ అయ్యారు. బీజేపీ ఐదేళ్లలో ఇదేనా దేశంలో వచ్చిన మార్పు అని అడిగారు. ఎరువులతో పాటు అనేక అంశాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి. చౌకీదార్ ఏమి చేస్తున్నాడు అంటూ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ధ్వజమెత్తారు. రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో విలువైన పత్రాలు చోరి అయ్యాయి. మరి ఈ చౌకీదార్ మోదీ ఏమి చేస్తున్నారు? రక్షణ శాఖలోనే పత్రాలు అదృశ్యమైతే, దేశంలో ఏమి జరుగుతోందని ఎస్పీ అధినేత ట్వీట్ చేశారు. ఈ పత్రాల అదృశ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు? మొదటి రాఫెల్ పత్రాలు మాయమయ్యాయని, ఆ తర్వాత అవి ఫోటోకాపీలంటూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను, సుప్రీం కోర్టును తప్పుదోవ బట్టిస్తున్నా రన్నారని తీవ్రంగా విమర్శించారు.