జాతీయ వార్తలు

రెండేళ్లలో ఏం సాధించారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాడోహీ (యూపీ), మార్చి 19: ఉత్తరప్రదేశ్‌లో సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదని, ఊరుగొప్ప, పేరు దిబ్బ తంతులా ప్రభుత్వం తీరు ఉందని ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. యూపీలో అభివృద్ధిపై ఉత్తుత్తి ప్రచారం జరుగుతోందన్నారు. యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ దాస్ ప్రభుత్వం రెండేళ్లుగా అధికారంలో ఉందని, కాని ప్రజలుకు ఏమి చేశామో చెప్పాలన్నారు. కేవలం పెద్ద ఎత్తున ప్రకటనలు చేసుకుంటున్నారని చెప్పారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందడం లేదన్నారు. బీజేపీ నేతలు గ్రామాలకు వెళ్లి చూడాలి. అక్కడ ఏమి జరుగుతుందో పరిశీలించాలి. అభివృద్ధి అంకెలు మీడియాలో కనపడుతున్నాయి. గ్రామాల్లో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు అని ఆమె ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలు తాము వేధింపులకు గురవుతున్నామనే భావనలో ఉన్నారన్నారు. అభద్రతాభావన వల్ల అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లు ఎడాపెడా హామీలు ఇవ్వవచ్చు. కాని ఆచరణలో చేసి చూపించాలన్నారు. ఇక్కడ ఆమె మాట్లాడుతూ కేంద్రంలో ఐదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా ప్రజలకు ఒరింగిదేమీ లేదన్నారు. గత 70 ఏళ్లలో అభివృద్ధి ఏమీ జరగలేదని బీజేపీ నేతలు కాంగ్రెస్‌ను దుమ్మెత్తిపోయడం అలవాటుగా మార్చుకున్నారన్నారు. ప్రజలకు కలుసుకుని ఓటు అడిగేందుకు ఆమె గంగానదిలో బోటులో ప్రయాణిస్తున్నారు. ఈ సందర్భంగా తీరం వెంట గ్రామాల్లో ఆమె పర్యటిస్తున్నారు. ప్రసంగాలు, ఆకట్టుకునే హామీల వల్ల ప్రజలకు న్యాయం జరగదన్నారు. విహారయాత్రల నిమిత్తం తాను, తన సోదరుడు రాహుల్ పర్యటిస్తున్నారని వచ్చిన విమర్శల్లో నిజం లేదన్నారు. తాను గత మూడు నాలుగేళ్లుగా ఇటలీకి వెళ్లలేదన్నారు.
చిత్రం.. యూపీలోని బాడోహీలో కాంగ్రెస్ నిర్వహించిన
శిక్ష మిత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ