జాతీయ వార్తలు

రెండో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: దేశంలోని 13 రాష్ట్రాల్లో 97 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 18వ తేదీన రెండవ దశ కింద ఎన్నికలు జరిగేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రక్రారం ఈ నెల 26వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. మార్చి 27వ తేదీన నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. మార్చి 29వ తేదీన నామినేషన్లను విత్ డ్రా చేసుకోవచ్చును. తమిళనాడులో 39 లోక్‌సభ సీట్లు, పుదుచ్చేరిలో ఒక సీటుకు ఎన్నికలు రెండవ దశలో జరగనున్నాయి. యూపీలో ఎనిమిది లోక్‌సభ సీట్లు ఆగ్రా, అలీఘడ్, మథురా తదితర సీట్లు, పశ్చిమబెంగాల్‌లో మూడు సీట్లు, బిహార్‌లో ఐదు లోక్‌సభ సీట్లలో ఎన్నికలు రెండవ దశలో జరుగుతాయి. యూపీలో 80, బిహార్‌లో 40, పశ్చిమబెంగాల్‌లో 42 సీట్లు ఉన్నాయి. కాశ్మీర్‌లోని ఉద్దంపూర్, శ్రీనగర్ లోక్‌సభ సీట్లకు రెండవ దశలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా దేశంలో రెండవ దశకు కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో భావసారూప్యత ఉన్న పార్టీలతో పొత్తుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి.