జాతీయ వార్తలు

బెంగాల్‌లో చతుర్ముఖ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 19: పశ్చిమబెంగాల్‌లోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో చతుర్ముఖ పోటీ జరగడం ఖాయంగాకనపడుతోంది. ఇప్పటికే బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్, వామపక్షపార్టీల మధ్య పొత్తు చర్చలు విఫలం కావడంతో, ఈ రెండు పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగుతున్నాయి. చతుర్ముఖ పోటీలో తమకు లాభమంటే, తమకు లాభమంటూ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు చంకలు గుద్దుకుంటున్నాయి. సరైన అభ్యర్థులు రంగంలోకి లేకపోవడం వల్ల మైనార్టీ ఓట్లు 30 శాతం తమకే దక్కుతాయని టీఎంసీ ఆనందంలో ఉంది. సెక్యులర్ ఓట్లు తమకేనంటూ టీఎంసీ అభ్యర్థులు సంబరాలు జరుపుకుంటున్నారు. సీపీఎం కూటమి, కాంగ్రెస్ మధ్య పొత్తు వికటించింది. సీపీఎం ఏకపక్షంగా 25 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో సంప్రదింపులు జరుపుతుండగా, ఏకపక్షంగా లెఫ్ట్ కూటమి అభ్యర్థులను ప్రకటించడంతో, కాంగ్రెస్‌కు కోపంవచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. విపక్ష కూటమి చీలికలు, పీలికలు కావడంతో తమ గెలుపుఖాయమని సీఎం మమతా బెనర్జీ చెబుతున్నారు. కాగా చతుర్ముఖ పోటీ వల్ల తమ పార్టీలాభపడుతుందని బీజేపీ వర్గాలు చెబఫుతున్నాయి. ప్రస్తుతం చాపకింద నీరులా విస్తరించిన బీజేపీ ఈ సారి ఆశ్చర్యకర ఫలితాలు సాధించే అవకాశం కనపడుతోంది.