జాతీయ వార్తలు

వీరులకు ‘శౌర్య’ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: తమ విధి నిర్వహణలో అసమాన ధైర్యసాహసాలు, శౌర్యప్రతాపాన్ని చూపిన సాయుధ దళాలకు చెందిన వ్యక్తులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం అవార్డులను బహూకరించారు. మంగళవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన ఇద్దరికి కీర్తిచక్ర, కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లో విధి నిర్వహణలో అసువులు బాసిన మరో ఇద్దరి కుటుంబ సభ్యులకు శౌర్య చక్ర అవార్డులను అందజేశారు. అలాగే తన ఇంటిపై మిలిటెంట్ల జరిపిన దాడిని ఎంతో సాహసంతో అడ్డుకున్న ఇర్ఫాన్ రంజాన్ షేక్ (16)కు సైతం శౌర్యచక్ర అవార్డును బహూకరించారు. కీర్తిచక్ర అవార్డులు అందుకున్న వారిలో అర్మర్డ్ కార్ప్స్‌కు చెందిన సోవార్ విజయ్‌కుమార్, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ప్రదీప్ కుమార్ పాండా అనే కానిస్టేబుల్ ఉన్నారు. అలాగే మణిపూర్‌లో ఉగ్రవాదులపై జరిపిన దాడిలో అసువులు బాసిన రైఫిల్‌మేన్ జయప్రకాష్ ఓరా, కాశ్మీర్‌లో మృతి చెందిన సిపాయి అజయ్‌కుమార్‌లకు శౌర్యచక్ర అవార్డులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఉగ్రవాదుల ఏరివేతలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ కుల్‌దీప్ సింగ్ చహర్, మేజర్ పవన్ కుమార్, రైఫిల్‌మేన్ రథ్వా లీలేష్ బాయి, నయిబ్ సుబేందర్ అనీల్‌కుమార్ దాహియా, సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జిలే సింగ్, హవల్దార్ జావెద్ అహ్మద్ భట్, హవల్దార్ కౌల్ బహదూర్ తపా, అర్జున్‌శర్మ, కెప్టెన్ అభయ్ శర్మ, మేజర్ ఇమ్లియాకుమ్ కేజర్, మేజర్ రోహిత్ లింగ్‌వాల్, లెఫ్టినెంట్ కల్నల్ విక్రాంత్ ప్రశీర్‌లకు శౌర్యచక్ర అవార్డులను రాష్టప్రతి ప్రదానం చేశారు. అలాగే రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పరమ విశిష్ట సేవా పతకాలను త్రివిధ దళాలకు చెందిన 13 మంది సీనియర్ అధికారులకు, ఉత్తమ యుద్ధ సేవా పతకాన్ని ఇద్దరు ఆర్మీ అధికారులకు, త్రివిధ దళాలకు చెందిన 26 మంది అధికారులకు అందజేశారు.

చిత్రం..రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం జరిగిన శౌర్య అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి కోవింద్,
ప్రధాని మోదీ, త్రివిధ దళాధిపతులు