జాతీయ వార్తలు

ఉగ్రవాదాన్ని అణచివేసే సత్తా మనకుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్గావ్, మార్చి 19: ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) 80 వార్షికోత్సంలో దోవల్ మంగళవారం మాట్లాడారు. పుల్వామాపై ఉగ్రదాడిని భారత్ తీవ్రంగానే పరిగణిస్తోందని ఆయన అన్నారు. 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్ర మూకలను వదిలిపెట్టే ప్రస్తిలేదని ఆయన ప్రకటించారు.‘ ఉగ్రవాదులను తుదముట్టించే విషయంలో భారత్ వెనుగడుగువేయదు. మనకు ఆ సత్తా ఉంది. ఈ విషయంలో మీకు పూర్తి భరోసా ఇస్తున్నాను’ అని దోవల్ పేర్కొన్నారు. పుల్వామా దాడికి జైషే మహ్మద్ అధినేత మసూదే సూత్రధారి. పాక్‌లోని బాలాకోట్ ఉగ్రవాద స్థావరంపై భారత్ వైమానిక దాడులకు దిగడం వెనక దోవల్ పాత్ర ఉంది. ప్రధాని నరేంద్రమోదీకి దోవల్ అత్యంత సన్నిహితుడు. ‘మనం ఏం చేయాలి?. మనం ఏ మార్గాన్ని అనుసరించాలి? ఎప్పుడు ఏ సమయంలో స్పందించాలి? అన్నదానిపై స్పష్టత ఉంది’అని జాతీయ భద్రతా సలహాదారు స్పష్టం చేశారు. ఎలాంటి సవాళ్లనైనా దీటుగా, ధైర్యంగా ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని దోవల్ పునరుద్ఘాటించారు. పుల్వామాలో చనిపోయిన 40 మంది జవాన్లకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు.

చిత్రం..సీఆర్‌పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవంలో గౌరవ వందనం స్వీకరిస్తున్న జాతీయ భద్రతా సలహాదారు దోవల్