జాతీయ వార్తలు

నేడు సావంత్ బలనిరూపణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, మార్చి 19: గోవా కొత్త ముఖ్యమంత్రిగా మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాణస్వీకారం చేసిన ప్రమోద్ సావంత్ బుధవారం అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధపడుతున్నారు. మనోహర్ పారికర్ మృతితో బీజేపీ అధిష్ఠానం సావంత్‌ను ఎంపిక చేసింది. తీవ్ర రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో సావంత్ ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. శాసన సభ్యలో తమకు 21 మంది ఎమ్మెల్యేలున్నారని బీజేపీ చెబుతోంది. బీజేపీకి 12 మంది గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ), మహారాష్టవ్రాది గోమంత్ పార్టీ(ఎంజీపీ) చెరో ముగ్గురు, ఇండిపెండెంట్లు ముగ్గురు ఉన్నారు. 40 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం 36 మంది ఎమ్మెల్యేలున్నారు. పారికర్, బీజేపీ ఎమ్మెల్యే ఫ్రాన్సిస్ డిసౌజా మృతిచెండడం, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుభాష్ శిరోద్కర్, దయానంద్ సాప్టే రాజీనామాతో నాలుగు ఖాళీలు ఏర్పడ్డాయి. నిజానికి అసెంబ్లీలో ఏకైక పెద్ద పార్టీ కాంగ్రెస్.
అలాగే ఎన్‌సీపీకి ఓ సభ్యుడున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమమే ఆహ్వానించాలని కాంగ్రెస్ గవర్నర్‌ను అడిగినా ఫలితం లేకపోయింది. బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అంతే సోమవారం బాగా పొద్దుపోయాక అంటే తెల్లవారితో మంగళవారం అనగా ప్రమోద్ సావంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ‘బుధవారం సభలో బల నిరూపణ చేసుకుంటామని గవర్నర్ మృదులా సిన్హాను కోరాం. ఆమె అంగీకారంతో దీనికి మేం సిద్ధంగా ఉన్నాం’అని కొత్త సీఎం సావంత్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. దివంగత మనోహర్ పారికర్ చేపట్టిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తానని ఆయన ప్రకటించారు.

చిత్రం..గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రమోద్ సావంత్