జాతీయ వార్తలు

పార్టీల వినతులపై ఆర్థిక నిపుణుల సంతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమవుతున్నుట్ల, గణాంక వివరాలు తప్పుడు తడకలంటూ 108 మంది ఆర్థిక నిపుణులు సంతకాలతో కూడిన వినతిపత్రం ద్వారా బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. ఈ తరహా వినతిపత్రాల వెనక రాజకీయ పార్టీలు ఉంటాయన్నారు. ఈ పార్టీలే ఈ వినతిపత్రాలను తయారు చేసి నిపుణులనే వారిచేత సంతకాలు చేయిస్తుంటారన్నారు. గత వారంలో సామాజిక శాస్తవ్రేత్తలుగా ముద్రపడిన వివిధ వర్శిటీ ప్రముఖులు కేంద్ర ఆర్థిక విధానాలను విమర్శించారు. వ్యవస్థల స్వతంత్రతను కాపాడాలని, నిర్వీర్యం చేయరాదని వారు కోరారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ డాటా మేనేజిమెంట్‌ను పర్యవేక్షిస్తుందన్నారు. ఇది స్వతంత్ర సంస్థని ప్రభుత్వ జోక్యం ఉండదన్నారు. గ్లోబల్ ప్రాక్టీసుల ద్వారా వీటి ప్రమాణాలను పరిరక్షిస్తుంటారన్నారు. ఈ రోజు విపక్ష నేతలకు హ్రస్వ దృష్టిలో ఆలోచించే నిపుణులకు అభివృద్ధి కనపడదన్నారు. వారు రాజకీయపరమైన నినాదాలు చేయడానికి పరిమితమవుతారన్నారు. అనేక విపక్ష పార్టీలు తయారు చేసే ప్రకటనలపై ఈ ఆర్థిక నిపుణులు సంతకాలు చేస్తుంటారన్నారు. వీరికి దిశ, దశ అంటూ ఉండదన్నారు. జీడీపీ పెరుగుతోందని, అభివృద్ధి బాగుందని చార్టెర్డ్ అకౌంటెంట్లు అంటున్నారని చెప్పారు. ఐదేళ్లలో జీడీపీ 7.5 శాతం వృద్ధిరేటు నమోదైందన్నారు. ద్రవ్యోల్బణం తగ్గిందన్నారు.