జాతీయ వార్తలు

భద్రతకే ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 19: తీవ్రమయిన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌లో మంగళవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జెట్ ఎయిర్‌వేస్ యాజమాన్యం వేతనాలు చెల్లించకపోవడం వల్ల దాని ప్రతికూల ప్రభావం తన సభ్యుల మానసిక స్థితిపై పడిందని, ఫలితంగా తమ సంస్థ నడుపుతున్న విమానాల భద్రత ప్రమాదంలో పడిందని జెట్ ఎయిర్‌వేస్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అసోసియేషన్ (జేఏఎంఈడబ్ల్యూఏ) ఆరోపించింది. జెట్ ఎయిర్‌వేస్ యాజమాన్యం వేతన బకాయిల చెల్లింపుల విషయంలో తమకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, అందువల్ల జోక్యం చేసుకొని వేతన బకాయిలు చెల్లింపచేయాలని (జేఏఎంఈడబ్ల్యూఏ) నియంత్రణ సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ను కోరుతూ ఒక వినతిపత్రం సమర్పించింది. ఈ వినతిపత్రం ప్రతులను ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంఓ), పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు, మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఈ-మెయిల్‌లో పంపింది.