క్రైమ్/లీగల్

అన్ని ఆధారాలతో నీరవ్‌ను రప్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: దేశంలో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రెండు వేల బిలియన్ డాలర్ల మేరకు ముంచి లండన్‌లో తలదాచుకుంటున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీని యూకే నుండి స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన పకడ్బందీ చర్యలు చేపడతామని సీబీఐ అధికార వర్గాలు తెలిపాయి. నీరవ్ మోదీని లండన్ నుంచి భారత్‌కు తీసుకురావడానికి వీలుగా న్యాయ సహాయాన్ని కోరుతామని, ఈ అంశాలన్నింటినీ దీనిపై దర్యాప్తు చేస్తున్న కేంద్ర సంస్థ ఇరు దేశాల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికార వర్గాలు నీరవ్ మోదీని భారత్‌కు పకడ్బందీగా తీసుకువచ్చేందుకు తగిన సమయం తీసుకుంటాయని ఆ వర్గాలు తెలిపాయి. నీరవ్ మోదీపై లండన్ కోర్టు సోమవారం అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాలు పేర్కొన్నాయి.