జాతీయ వార్తలు

విషాదం నుంచి రాజకీయ లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, మార్చి 19: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల సమస్యలు, అవసరాలు, కష్టాలు, పేదరికం వంటివి ప్రధాన అంశాలుగా చేసుకుని ప్రచారం నిర్వహించాలే తప్ప దేశంలో జరిగిన ఒక విషాద సంఘటనను ఆధారంగా చేసుకుని జరపడం విచారకరమని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ అన్నారు. కాశ్మీర్‌లోని పుల్వామా సంఘటన తర్వాత దానిని ఓటు బ్యాంకుగా మలచుకోవడానికి బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ దానిని ‘ఖాకీ ఎన్నికలు’గా మార్చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయ్యారని, ఆ అంశాన్ని తమకు లబ్ధి చేకూర్చేలా మార్చుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు జరిగే సార్వత్రిక ఎన్నికలను ‘జాతీయ భద్రతా సంబంధ ఎన్నికలు’గా మార్చేస్తోందన్నారు. పుల్వామా సంఘటన జరిగిన వెంటనే జాతి మొత్తం తీవ్ర ఉద్వేగం చెందిందని, తాము సైతం ఆ సంఘటనపై తగురీతిలో స్పందించామని ఆయన చెప్పారు. ఆ సంఘటన తర్వాత పాక్ భూభాగంపై వైమానిక దాడులు జరిపించిన మోదీ ఆ అంశాన్ని ఈ ఎన్నికల్లో తమకు ప్రయోజనం చేకూర్చేలా మార్చుకుంటున్నారని, జాతీయ భద్రతా అంశం అని పేర్కొంటూ దీనిని ‘ఖాకీ ఎన్నికలు’గా మార్చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ అంశాన్ని బాగా హైలెట్ చేస్తూ దేశ భద్రత ప్రమాదంలో పడిందని, ఈ విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత తమపైనే ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి దేశం ఇప్పుడు అలాంటి ప్రమాదకర పరిస్థితినేమీ ఎదుర్కోవడం లేదని శశిథరూర్ పేర్కొన్నారు. తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్‌పై కనే్నసిన శశిథరూర్ దేశంలోని ప్రధాన సమస్యలైన ఆకలి, పేదరికం, ఉపాధి, ఆవాస లేమి తదితర వాటితో లక్షలాది మంది బాధపడుతున్నారని, మోదీ ప్రభుత్వం వాటిపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగని దేశభద్రత అంశాన్ని తాను తక్కువ చేయడం లేదని, కాని సమస్యలను వదిలిపెట్టి ఒక విషాదకర సంఘటనను తమకు అనుకూలంగా మలచుకోవడం తగదని మోదీ ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ఆయన తెలిపారు.