జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో ‘లెఫ్ట్’ అభ్యర్థులు వీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే లోక్‌సభ స్థానాలకు వామపక్ష పార్టీలు బుధవారం అభ్యర్థులను ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీఎస్పీ, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో బాగంగా కర్నూలు లోక్‌సభ స్థానానికి కే,ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు లోక్‌సభ స్థానానికి చండ్ర రాజగోపాల్‌ను అభ్యర్థులుగా సీపీఐ(ఎం) ప్రకటించింది. అలాగే అనంతపురం స్థానానికి డీ. జగదీశ్, కడప ఈశ్వరయ్య, విజయవాడకు చలసాని అజయ్‌కుమార్‌ను అభ్యర్థులుగా సీపీఐ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులో భాగంగా వామపక్ష పార్టీలు చేరో రెండు లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తాయని ముందుగానే జనసేన, వామపక్షాలు ప్రకటించాయి. అనూహ్యంగా సీపీఐ విజయవాడ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది.
తెలంగాణలో 2 లోక్‌సభ స్థానాలకు సీపీఐ (ఎం)
తెలంగాణలోని రెండు లోక్‌సభ స్థానాలకు సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థులనూ ఖరారు చేసింది. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి మల్లు లక్ష్మీని బరిలోకి దింపగా, ఖమ్మం నుంచి బీ.వెంకట్‌ను అభ్యర్థిగా ప్రకటించింది.