జాతీయ వార్తలు

హోలీ తరువాత మోతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, మార్చి 20: ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. హోలీ తరువాత అతిరథమహారధులు రాష్ట్రానికి తరలిరానున్నారు. ఏప్రిల్ 11నే మొదటి విడతలోనే ఉత్తరాఖండ్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తూర్పు యూపీ ఇన్‌చార్జి ప్రియాంక గాంధీ కుమావున్ ప్రాంతంలో రోడ్‌షోకు చేపడతారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కుమావున్, గర్వాల్ ప్రాంతాల్లో సభలో ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. రెండు పార్టీలూ ప్రముఖులను ప్రచారానికి దింపుతున్నాయి. కుమావున్, గర్వాల్‌లో రెండేసి సభల్లో మోదీ పాల్గొనేలా పర్యటన ఖరారైంది. అయితే ఏఏ తేదీల్లో, ఎక్కడెక్కడ సభలు పెట్టాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ వెల్లడించారు. డెహ్రాడూన్, హరిద్వార్, శ్రీనగర్, హల్‌ద్వానీలో మోదీ ర్యాలీలు ఉండే అవకాశం ఉంది. అలాగే తెహ్రీ, అల్మోరాలో అమిత్‌షా సభలుంటాయని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్ర రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్, కేంద్ర మంత్రులు వీకే సింగ్, జేపీ నడ్డా, ఎంపీ హేమమాలిని, మనోజ్ తివారీ ప్రచారానికి వస్తున్నట్టు భట్ తెలిపారు.
ప్రియాంక గాంధీతోపాటు ఆమె సోదరుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డెహ్రాడూన్ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. ప్రియాంక కూడా కుమావున్ ప్రాంతంలో రోడ్‌షోల్లో పాల్గొంటారని కాంగ్రెస్ సీనియర్ నేత సూర్యకాంత్ ధాస్మనా తెలిపారు. ప్రచారానికి సంబంధించి ఎవరెవరు వస్తున్నదీ ఓ జాబితా సిద్ధం చేశామన్నారు. మాజీ సీఎం హరీష్ రావత్, పీసీసీ అధ్యక్షుడు ప్రతిమ్ సింగ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హృదయేశ్, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి అనుగ్రహ్ నారాయణ్ సింగ్ ప్రచారం చేస్తారని అన్నారు. ఇలా ఉండగా కాంగ్రెస్, బీజేపీ ఇప్పటి వరకూ అభ్యర్థులను ప్రకంటించలేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ గాలి ఉండడంతో ఐదు లోక్‌సభ స్థానాల్లోనూ బీజేపీ గెలిచింది. ఇప్పుడు అలాంటి వాతావరణం లేదని, గట్టిపోటీనే ఎదుర్కోవలసి ఉంటుందని రాజకీయ విశే్లషకులు వెల్లడించారు.