జాతీయ వార్తలు

కమలం గూటికి డీకే అరుణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ మంగళవారం అర్ధరాత్రి బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. తెలంగాణ ఇంటి పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యన్న శ్రీనివాస్‌రెడ్డి కూడా బీజేపీలో చేరారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో డీకే అరుణ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర్‌రావు విలేఖరులతో మాట్లాడారు. డీకే అరుణ విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అలాంటిది టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేసిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి రెండోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క్షీణించిపోతోందని, దానికి కాంగ్రెస్‌లోని ముఖ్యనేతల వ్యవహార శైలే కారణమని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ చేరాలని పార్టీ శ్రేణుల నుంచి సూచనలు వచ్చాయని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని వీడడం బాధగానే ఉందని ఆమె అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీతో కాంగ్రెస్‌లో కొంతమంది నాయకులు లాలూచీ పడి పార్టీని నాశనం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి బీజేపీకే అవకాశాలున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. దేశప్రజలకు రక్షణ కల్పించే శక్తి కేవలం బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోదీకే ఉందని, అందుకే బీజేపీలో చేరుతున్నట్టు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
చిత్రం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన డీకే అరుణ