జాతీయ వార్తలు

ఓటు హక్కుపై దీపిక ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 20: ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లను చైతన్యవంతం చేయడంలో బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకోనె తనవంతు పాత్ర నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకుని ఓటు వేయడం ద్వారా దేశానికి తమ వంతు సేవలు అందించావలని ఆమె కోరుతున్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన జీ సినీ అవార్డుల ప్రధానోత్సవంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. సంజయ్‌లీలా బన్సాలీ నిర్మించిన పద్మావతి చిత్రంలో నటనకుగాను ఉత్తమ మహిళా నటి అవార్డును ఈ సందర్భంగా ఆమె సొంతం చేసుకున్నారు. ‘ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాల్సిన సమయమిది. ఎవరికి ఓటేస్తున్నామన్నది మన వ్యక్తిగత విషయం. కొంతమంది ఇప్పటికే ప్రభుత్వ పథకాలను ఆస్వాదించి ఉంటారు. మరికొంత మందికి అందుబాటులోకి రాకపోయి ఉండవచ్చు. ఐతే ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ప్రతి పౌరుడి బాధ్యత’ అని ఆమె పేర్కొన్నారు. ఓటర్లలో చైతన్యం కలిగించాల్సిందిగా ప్రధాని మోదీ గతవారం 20మంది సినీ రంగ ప్రముఖులకు పిలుపునివ్వగా అందులో 33 ఏళ్ల దీపిక కూడా ఉన్నారు. అవార్డులే సర్వస్వం అన్న ఆలోచన మంచిది కాదని, బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాధించడం, ప్రేక్షకుల ప్రేమ ప్రధానమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ముంబయి అకాడమీ ఆఫ్ మువింగ్ ఇమేజ్ (ఎంఏఎంఐ) చైర్‌పర్సన్ కావడంపై ఆమె వ్యాఖ్యానిస్తూ సమాజంలో మార్పును తీసుకురావడంలో యువత ప్రముఖ పాత్ర వహిస్తుందన్న నమ్మకంతోనే ఈ బాధ్యతను చేపట్టామని దీపిక పేర్కొంది.