జాతీయ వార్తలు

2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్: ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ గుప్పించిన హామీలు ఏమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. ఇక్కడ జరిగిన పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత ఏడాది సుమారు కోటి ఉద్యోగాలను మోదీయే తీయించేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగ కల్పనకు హామీ ఇచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్న ఉద్యోగాలను కూడా తీసివేశారంటూ ఆరోపించారు. మోదీ ఆధ్వర్యంలో గత ఏడాది మొత్తం మీద రోజుకు 30,000 మంది ఉద్యోగాలను కోల్పోయారని అన్నారు. ఈ విధంగా దేశం మొత్తం మీద ఒక్క ఏడాదిలోనే కోటి ఉద్యోగాలను ఆయన నాశనం చేశారంటూ విమర్శించారు. పెద్ద నోట్ల ఉపసంహరణ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని అన్నారు. ప్రజల జీవితాలు దారుణంగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులను గందరగోళంగా మార్చిన మోదీ, ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఏ విధంగా హామీ ఇచ్చారని నిలదీశారు. ‘మోదీ ఉన్నట్టుండి నిర్ణయాలు తీసుకుంటారు. హఠాత్తుగా ఒక రోజు పెద్ద నోట్లు రద్దంటూ ప్రకటిస్తారు. ఈ నిర్ణయం వల్ల ప్రజల జీవితాలు ఎంతగా ప్రభావితం అవుతాయో? ఎంత దారుణంగా మారుతాయో? ఆయనకు పట్టదు. ప్రజల జీవితం సర్వనాశనమవుతున్నా పట్టించుకోరు’ అంటూ మోదీపై రాహుల్ నిప్పులు చెరిగారు. ఈశా న్య రాష్ట్రాలకు, ప్రత్యేకించి మణిపూర్‌లో ఉన్నవారిపై పౌరసత్వ సవరణ బిల్లును వర్తింప చేస్తున్నట్టు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ప్రకటనను రాహుల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మణిపూర్ ప్రజలకు కేంద్రం అన్యా యం చేస్తున్నదని ఆరోపించారు. ‘మీ సంస్కృతి, సంప్రదాయాలపై బీజేపీ నేతలు దాడులు చేస్తున్నారు. అందుకే, ఆ బిల్లుకు ఆమోద ముద్ర పడకుండా కాంగ్రెస్ అడ్డుకుంది. మణిపూర్ ప్రజల మనోభావాలను బీజేపీ దెబ్బతీస్తుంటే, కాంగ్రెస్ గౌరవిస్తున్నది. మీ సంస్కృతిని రక్షిస్తున్నది. పౌరసత్వ సవరణ బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదం పొందకుండా చూస్తుంది’ అని హామీ ఇచ్చారు. మోదీ మాటలకు చేతలకు ఎక్కడా పొంతన లేదని విమర్శించారు. మణిపూర్‌సహా ఈశాన్య రాష్ట్రాలకు మోదీ సర్కారు చేసిందని ఏమీ లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలో వస్తుందని, మణిపూర్ ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందని రాహుల్ అన్నారు.
చిత్రం..ఇంఫాల్‌లో బుధవారం జరిగిన పబ్లిక్ ర్యాలీలో ప్రసంగిస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ