జాతీయ వార్తలు

వారణాసి నుంచే మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీ చేస్తారు. దీంతో బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీ పోటీ నుంచి తప్పుకున్నారని భావించవలసి ఉంటుంది. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మరోసారి కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మతీ ఇరానీని బీజేపీ రంగంలోకి దించింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్‌ప్రకాశ్ నడ్డా గురువారం రాత్రి ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 184 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ప్రధాని మోదీ సమక్షంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 16,19,20 తేదీల్లో సమావేశమైంది. రాష్ట్రాల వారీగా రాజకీయ పరిస్థితిని సమీక్షించిన అనంతరం అభ్యర్థుల ఎంపిక చేసిందని నడ్డా ప్రకటించారు. బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో 20 రాష్ట్రాలకు చెందిన 184 మంది అభ్యర్థులున్నారు. ఉత్తరప్రదేశ్‌లో29, మహారాష్టల్రో 16, అండమాన్ నికోబార్‌లో ఒకటి, అస్సాం నుంచి 8, అరుణాచల్ నుంచి రెండు, చత్తీస్‌గఢ్ నుంచి 5 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు. దాదర్ నగర్ హవేలీలో ఒకటి, జమ్మూకాశ్మీర్‌లో ఐదు, కర్నాటకలో 21, కేరళలో 13, లక్షద్వీప్‌లో ఒకటి, మణిపూర్‌లో రెండు, ఒడిశాలో పది, రాజస్థాన్‌లో 16, సిక్కింలో ఒకటి, తమిళనాడులో ఐదు, తెలంగాణలో పది, త్రిపురలో రెండు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లో ఐదు, పశ్చిమ బెంగాల్‌లో 28, ఆంధ్రప్రదేశ్‌లో రెండు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్టల్రోని నాగ్‌పూర్ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. సినీనటి, ఎంపీ హేమమాలిని మరోసారి ఉత్తరప్రదేశ్‌లోని మథుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
బిహార్‌లో 17 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినా, వారి పేర్లను తరువాత ప్రకటిస్తామని నడ్డా వెల్లడించారు.
చిత్రం..బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్న జగత్‌ప్రకాశ్ నడ్డా