జాతీయ వార్తలు

ఉల్లాసంగా..ఉత్సాహంగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 21: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న నాయకులు పార్టీలకు అతీతంగా గురువారం హోలీ వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. జరుపుకొన్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా నాయకులందరీ హోలీ సంబరాల్లో మునిగితేలారు. వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకున్నారు. ఆనంద డోలికల్లో తేలిపోయారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పుల్వామా ఉగ్ర దాడికి నిరసనగా తాను హోలీ జరుపుకోవడం లేదని తృణమూల్ అధినేత్రి ట్వీట్ చేశారు. అయితే తన నివాసానికి వచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు మమత శుభాకాంక్షలు తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బందోపాధ్యాయ స్థానిక ఆలయంలో పూజలు నిర్వహించి వీధుల్లో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. కల్యాణ్ శ్రీరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీలోఉన్నారు. ఆయన వీధుల్లోకి వచ్చి నృత్యం చేశారు. అభిమానులతో కలిసి వేడుకలు చేసుకున్నారు. బర్రాక్‌పూర్ బీజేపీ నేత అర్జున్‌సింగ్ ‘రంగ్ బర్సే భిగే’ పాట పాడుతూ నాట్యమాడారు. పనిలోపనిగా అధికార టీఎంసీపై సింగ్ విమర్శలు గుప్పించారు. తృణమూల్‌ను ఓడించి బీజేపీకి పట్టం గట్టాలని ఆయన పిలుపునిచ్చారు. భాట్‌పార అసెంబ్లీ సెగ్మెంట్‌లోని రోడ్లపై సింగ్ హోలీ జరుపుకొన్నారు. కోల్‌కతా దక్షిణ లోక్‌సభ నియోజకవర్గలో టీఎంసీ అభ్యర్థి మాలా రాయ్, సీపీఎం అభ్యర్థి నందిని ముఖోపాధ్యాయ ఇద్దరూ పార్టీ అభిమానులతోకలిసి పండగ చేసుకున్నారు. ఓపెన్ టాప్ జీపుల్లో ఊరేగుతూ ముఖానికి రంగులు పూసుకుని మరీ మద్దతు దారులను ఉత్సాహపరిచారు. అనేక చోట్ల పార్టీలకు అతీతంగా కలిసే హోలీ వేడుకలు చేసుకున్నారు. ‘మా పార్టీలకే రాజకీయాలు తప్ప మాకు కాదు. హోలీ మన సంస్కృతి. మన జీవితాల్లో చెడును తొలగించి మంచి జరగాలి’అని కార్యకర్తలకు చెప్పామని వారన్నారు. కోల్‌కతా దక్షిణ లోక్‌సభలో ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తున్నది మహిళలే కావడం గమనార్హం. జాదవ్‌పూర్ ఎంపీ బి భట్టాచార్య నియోజవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ ‘ లెఫ్ట్ పార్టీలకే ఓట్లేయండి. సెక్యులర్ శక్తులను బలపరచండి’అని అభ్యర్థించారు. టీఎంసీ, బీజేపీ నాణానికి బొమ్మా బొరుసులాంటివని విమర్శించారు. టీఎంసీ అభ్యర్థి ప్రసూన్ బందోపాధ్యాయ తన నియోజకవర్గం పరిధిలోని సల్‌కియా ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే, క్రికెటర్ లక్ష్మీరతన్ శుక్లాతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. చెట్లా ఏరియాలో రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీం జనంలో కలిసిపోయి హోలీ ఆడారు. ‘మేం ఎన్నో ఏళ్ల నుంచి హోలీ ఆడుతున్నాం. ఈ పండుగ బెంగల్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. అన్ని పండుగలతోపాటే హోలీని ఘనంగా జరుపుకొంటాం’ అని మంత్రి స్పష్టం చేశారు. అలాగే ముర్షిదాబాద్ జిల్లా బెరహంపూర్‌లోని కాంగ్రెస్ ఆఫీసు వద్ద హోలీ సంబరాలు మిన్నంటాయి. పార్టీ నేత అధిర్ చౌదరి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ మహిళా మోర్చా నేత లాకెట్ చటర్జీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి రంగులు జల్లుకున్నారు.
చిత్రం..గోరఖ్‌పూర్‌లో జరిగిన హోలీ వేడుకల్లో మాట్లాడుతున్న యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్