జాతీయ వార్తలు

బోరుబావిలో పసిబాలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిసార్ (హర్యానా), మార్చి 21: బోరుబావిలో పడిన 18 నెలల పసిబాలుడిను రక్షించేందుకు హర్యానా ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. ఈ బోరుబావి 60 అడుగుల లోతు ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. బాలుడు క్షేమంగానే ఉన్నాడని, రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ జోగీందర్ సింగ్ చెప్పారు. బోరుబావిలో పైపులతో బాలుడికి ఆక్సిజన్‌ను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇంకా బిస్కెట్లు, పళ్ల రసం కూడా సమకూర్చినట్లు చెప్పారు. ఈ బాలుడు తోటి పిల్లలతో ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడని చెప్పారు. జాతీయ విపత్తు రక్షణ దళం రంగంలోకి దిగింది. పెద్ద ప్రొక్లైనర్లను రంగంలోకి దింపి సమాంతరంగా మట్టిని వెలికి తీస్తున్నామన్నారు. పసిబాలుడి తండ్రి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బోరుబావిని తవ్విన తర్వాత మూయకుండా వదిలేసిన యజమానిపై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ అశోక్ కుమార్‌మీనా చెప్పారు.