జాతీయ వార్తలు

జవాబు లేని ప్రశ్నలెన్నో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: అధికార పార్టీ ఎంపీగా ఉన్నప్పటికీ అధినాయకత్వంపై నిత్యం విమర్శలు గుప్పించే శతృఘ్నసిన్హా గురువారం మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మోదీకి ఓ పక్క హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మరోపక్క హెచ్చరికలు చేశారు. ‘మోదీజీ.. మీకు హోలీ శుభాకాంక్షలు’ అని సిన్హా అన్నారు. ‘చౌకీదార్‌గా చెప్పుకుంటున్న మీరు.. సమాధానం చెప్పని ప్రశ్నలెన్నింటికో బదులివ్వాల్సి ఉంటుంది’ అని ఎంపీ పేర్కొన్నారు. గతవారమే మోదీ తన పేరుకు ముందు చౌకీదార్ అని పెట్టుకుని ట్వీట్ చేశారు. గంటలోనే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, పలువురు కేంద్రమంత్రులు తమ పేర్లకు ముందు ‘చౌకీదార్’ చేర్చుకున్నారు.
‘మోదీజీ.. మిమ్మల్ని మీరు చౌకీదార్ (కాపలాదారు)గా ప్రచారం చేసుకుంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది. అదే సమయంలో జాతికి సమాధానం చెప్పని ప్రశ్నలెన్నో ఉన్నాయి. రాఫెల్ సహా అనేక వాటికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంది’ అని బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా హెచ్చరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాఫెల్ కుంభకోణంపై మోదీని టార్గెట్ చేసుకుని అనేకసార్లు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఎంపీ శతృఘ్నసిన్హా ఈ ఎన్నికల్లోనూ బిహార్ నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తారని తెలిసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పాట్నా సాహిబ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన సిన్హా పార్టీ నాయకత్వంపై తరచూ విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు. అధినాయకత్వం కూడా ఆయనను పక్కన బెట్టేసింది. రాఫెల్ సహా అనేక అంశాలపై సొంత పార్టీపైనే ఆరోపణలు చేశారు. కాగా ఈసారి పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పోటీ చేస్తారని తెలిసింది.