జాతీయ వార్తలు

బీజేపీ పాలనలో ఉపాధి ఉష్‌కాకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: ప్రధాని మోదీ ఐదేళ్ల పాలనలో దేశంలో 3.2 కోట్ల మంది రోజువారీ కూలీలు ఉపాధి కోల్పోయారని, బీజేపీ ప్రభుత్వం చేసిన మోసానికి ఈసారి ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి వారంతా సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ విమర్శించింది. 2011-12 నుంచి 2017-18 మధ్య దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 3.2 కోట్ల మంది రోజువారీ కూలీలు ఉపాధి కోల్పోయారంటూ ఇటీవల నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) పేర్కొన్న విషయాన్ని ఒక ఇంగ్లీష్ దినపత్రిక వెలుగులోకి తేవడాన్ని కాంగ్రెస్ ప్రస్తావిస్తూ బీజేపీ భారతదేశ ఉద్యోగాలను అపహరించిందని, ఆ పార్టీ పాలనలో 3.2 కోట్లమంది రోజువారీ కూలీలు ఉపాధి కోల్పోగా, అందులో మూడు కోట్ల మంది వ్యవసాయ కూలీలేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆ వార్తను ట్యాగ్ చేస్తూ తెలిపారు. అంతేకాకుండా ఎన్డీఏ పాలనలో 4.7 కోట్ల మంది యువత ఉద్యోగాలను కోల్పోయారని, ఇలాంటి పచ్చి నిజాలను మోదీ ప్రభుత్వం మరుగున పెట్టిందని విమర్శించారు. గత ఎన్నికల్లో కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, కోట్లాది మందికి ఉద్యోగాలు, ఉపాధిని పోగొట్టి వారిని రోడ్డున పడేసిందని, అలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
కాగా, తమ పాలనలో అనేకమందికి ఉద్యోగాలు కల్పించామంటూ ప్రధాని మోదీ చేస్తున్న ప్రకటనలపై బుధవారం కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ మండిపడ్డారు. మోదీ విధానాల వల్ల గత సంవత్సరమే కోటి మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారని, దానిని మరచి మోదీ ఉద్యోగాల గురించి మాట్లాడటం పెద్ద జోక్ అని విమర్శించారు. వాస్తవానికి భారత్‌లో ప్రతి రోజు 450 కొత్త ఉద్యోగాలు వస్తాయని, కాని మోదీ ప్రభుత్వ హయాంలో దానికి పూర్తి వ్యతిరేకంగా జరిగిందని, 2018లో ప్రతి రోజూ 27 వేల ఉద్యోగాలు పోయాయని, ఆ సంవత్సరంలో కోటి మందికి పైగా ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున పడ్డారని ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలో రాహుల్ విమర్శలకు బలం చేకూర్చేలా ఇంగ్లీష్ డైలీ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ పేర్కొన్న వివరాలను ప్రచురించడంతో కాంగ్రెస్ తన విమర్శలకు మరింత పదును పెట్టింది. ఇది మోదీ అసమర్థ పాలనకు అద్దం పడుతోందని రణదీప్ సూర్జేవాలా మండిపడ్డారు. 4.7 కోట్ల మంది ఉపాధిని అపహరించిన దేశ కాపలాదారు మోదీ దీనికి వెంటనే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.