జాతీయ వార్తలు

మళ్లీ తెగబడిన పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, మార్చి 21: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ వెంట గల భారత సైనిక పోస్టులపై, ఫార్వర్డ్ ఏరియాలపై పాకిస్తాన్ బలగాలు గురువారం ఫిరంగులు, మోర్టార్ బాంబులతో దాడికి దిగాయి. ఈ దాడిలో ఒక భారత జవాను వీరమరణం పొందాడని అధికారులు తెలిపారు. సుందర్‌బని సెక్టార్‌లోని కేరి ప్రాంతంలో పాకిస్తాన్ బలగాలు గురువారం ఉదయం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఫిరంగి గుండ్ల వర్షం కురిపించాయని, మోర్టార్ బాంబులతో దాడికి దిగాయని అధికారులు వివరించారు.
పాకిస్తాన్ బలగాలు జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన భారత జవానును 24 ఏళ్ల రైఫిల్‌మాన్ యశ్‌పాల్‌గా గుర్తించారు. యశ్ పౌల్ స్వంత ఊరు జమ్మూకాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా మంతలాయి గ్రామం. గురువారం కడపటి సమాచారం అందేంత వరకు కూడా సుందర్‌బని సెక్టార్‌లో పాకిస్తాన్ బలగాల కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. నౌషెరా సెక్టార్‌లోనూ గురువారం మధ్యాహ్నం 2.45 గంటలకు పాకిస్తాన్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, భారత్‌పై కాల్పులు ప్రారంభించాయని అధికారులు వెల్లడించారు. అఖ్‌నూర్ సెక్టార్‌లోనూ పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరపడాన్ని, ఫిరంగి గుండ్ల దాడిని తిరిగి ప్రారంభించాయని వారు వివరించారు. భారత సైన్యం గట్టిగా బదులిస్తోందని వారు వెల్లడించారు. పాకిస్తాన్ బలగాలు ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు నియంత్రణ రేఖ వెంబడి 110సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి.