జాతీయ వార్తలు

మోదీని సాగనంపుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: ఎన్డీయే సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో తీసుకున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ తన పదవిని కోల్పోవడం ఖాయమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ఓటమి ఖాయమని గత వారం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం నాయకత్వంలో జరిగిన పార్టీ మారథాన్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని వచ్చినట్టు ఆయన తెలిపారు. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ మూడు సూత్రాల అజెండాతో ముందుకు సాగుతుందని అన్నారు. అందులో మొదటిది మోదీని ప్రభుత్వాన్ని గద్దె దింపడం ద్వారా దేశాన్ని రక్షించడం, రెండోది తప్పనిసరిగా ఓటు వేయాలన్న లెఫ్ట్ పార్టీల నిర్ణయంలో మార్పు, కేంద్రంలో లౌకిక భావాలు కలిగిన ప్రభుత్వమే అధికారంలోకి రావాలన్న అజెండాతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ‘నేనూ చౌకీదారునే’ అని తనను తాను అభివర్ణించుకుంటూ దేశంలోని ప్రజలంతా తన మాదిరిగానే చౌకీదారులు కావాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చిన నేపథ్యంలో మోదీని మరోసారి మళ్లీ అధికారంలోకి రాకుండా లెఫ్ట్ పార్టీలు నిర్ణయించిన విషయాన్ని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బలంగా లేని చోట మిగిలిన లెఫ్ట్ పార్టీల తరఫున తగిన, సరైన అభ్యర్థులను గుర్తించి పోటీకి బరిలోకి దింపుతామని అంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీతో తమ పార్టీ పోరాడుతుందని ఆమె తెలిపారు.