జాతీయ వార్తలు

ప్రజలు క్షమించరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ దాడుల అనంతరం ప్రతీకారంగా పాక్‌లోని బాలాకోట్‌లో భారత వైమానిక దాడులు జరిపిన ఘటనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. ‘ఉగ్ర దాడులపై విమర్శలు చేయడం వారికి అలవాటే’, ‘సాయుధ దళాల త్యాగాలను ఎత్తిచూపడం’ సహజమే అంటూ ప్రతిపక్షాలపై మోదీ తీవ్ర స్థాయలో విరుచుకుపడ్డారు. ‘ప్రజలు వారిని క్షమించరు’ అని ప్రధాని మోదీ శుక్రవారం ఒక ట్వీట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన సలహాదారు శాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అన్నారు. ‘ముంబయి దాడుల తర్వాత వైమానిక దాడుల ద్వారా ప్రతీకారం తీర్చుకోవాల్సి ఉంది. కానీ అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తగిన విధంగా స్పందించి ప్రపంచాన్ని నమ్మించలేకపోయింది. న్యాయవ్యవస్థపై నమ్మకం లేని కాంగ్రెస్ అప్పట్లో జరిగిన ఉగ్ర ఘటనపై తగిన ప్రతీకారం తీర్చుకోవడంలో విఫలమైన విషయం దేశ ప్రజలందరికీ విధితమే. కానీ ఇపుడు బీజేపీ హయాంలో అలా కాకుండా ఉగ్రదాడులకు వెంటనే తగిన సమాధానం చెబుతున్నాం’ అని ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై ప్రతి దాడికి దిగారు. ‘ప్రతిపక్షాలు మళ్లీ మన సైనిక దళాల త్యాగాలను కించపరుస్తున్నాయి. వారు చేస్తున్న భిన్న ప్రకటనలను దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు గమనిస్తున్నారు. వారు ప్రతిపక్షాలకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాల చేష్టలను ప్రజలను గమనిస్తున్నారని, సాయుధ దళాల వెన్నంటే దేశం యావత్తు ఉంటుందన్న విషయం గురించి తెలుసుకోవాలని ప్రతిపక్షాలకు హెచ్చరించారు. ఇదిలావుండగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సైతం తన ట్విట్టర్‌లో ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘వారి హృదయాలు టెర్రరిస్టుల కోసం..మా హృదయాలు దేశం కోసం. ఇదీ ప్రతిపక్ష పార్టీలకు, బీజేపీకి మధ్య ఉన్న తేడా. ఇది నిజం’ అని వ్యాఖ్యానించారు. ‘వాళ్లు మన దేశ సైనికుల త్యాగాలను అనుమానిస్తున్నారు. మేం గర్విస్తున్నాం’ అని అమిత్ షా ప్రతిపక్షాలకు విమర్శలు గుప్పించారు. ‘ఈ ఎన్నికల్లో సర్జికల్ స్ట్రయిక్ వంటి దాడుల తరహాలో ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ సంస్కృతిపై దాడులకు దిగండి’ అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాలాకోట్‌లో భారత వైమానిక దాడులపై తనకు అనుమానాలు ఉన్నాయని, ‘మరింత సమాచారం’ కావాలని కాంగ్రెస్ నాయకుడు శాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ‘శాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగే అవకాశం ఉంది’ అని అన్నారు. ‘బాలాకోట్‌లో జరిపిన వైమానిక దాడులు తప్పు అని శాం పిట్రోడా అనుకుంటున్నారా? ప్రపంచంలోని ఏ దేశం కూడా ఇంతవరకు భారత వైమానిక దాడులను వేలెత్తి చూపలేదు. ఇస్లామిక్ ఆర్గనైజేషన్ కూడా ఇది తప్పు అని పేర్కొనలేదు. కానీ రాజకీయ పార్టీలో రోల్ మోడల్‌గా ఉన్న వ్యక్తులే ఇలాంటి విమర్శలకు దిగడం దురదృష్టకరం’ అని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. పుల్వామా దాడులను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని సమాజవాది పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ చేసిన విమర్శలను మోదీ తిప్పి కొట్టిన విషయాన్ని అరుణ్ జైట్లీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.