జాతీయ వార్తలు

ఉగ్ర మూలాల ధ్వంసమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: ఉగ్రవాదం మూలాలను ధ్వంసం చేయాలన్నదే ఎన్‌డీఏ లక్ష్యమని, దాని కోసమే పట్టుదలతో పనిచేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఉద్ఘాటించారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రముఖ క్రికెటర్ గౌతం గంభీర్ పార్టీలో చేరిన సందర్భంగా జైట్లీ విలేఖరులతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యమని జైట్లీ స్పష్టం చేశారు. అందులో భాగంగానే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదుల క్యాంపులపై మెరుపు దాడులు, బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరంపై వైమానిక దాడులని ఆయన గుర్తుచేశారు. దేశ భద్రత కోసం ఉగ్రవాదం పుట్టి, పెరి గే ప్రాంతాన్ని ధ్వంసం చేయాలన్న దే తమ విధానమని ఆర్థిక మంత్రి పునరుద్ఘాటించారు. ‘ఉగ్రవాదులు మన దేశంపై దాడి చేసినప్పుడు ఎదుర్కొనేవారు కావాలా? లేక దేశ భద్రతను పట్టించుకోకుండా ఉండే వారు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి’అని ఆయన అన్నారు. బాలాకోట్ దాడికి సంబంధించిన వాస్తవాలను బయటపెట్టాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాం ధీకి అత్యంత సన్నిహితుడైన విదేశీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి శామ్‌పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై జైట్లీ స్పందించారు. పిట్రోడా అలాంటి డిమాండ్ చేయడం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. ఉగ్రవాదులను అణిచివేసే విషయంలో యుపీఏ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభు త్వం మరింత మెరుగుపరిచిందని చెప్పారు. ‘మన దేశంలోకి వచ్చి దాడులు చేసినప్పుడే ఉగ్రవాదులను ఎదుర్కోవాలన్నది యుపీఏ సర్కార్ విధానం. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం దీన్ని మరింత మెరుగుపరిచి ఉగ్రవాదం మూలాలనే ధ్వంసం చేయాలని విధానంతోముందుకెళ్తున్నారు’అని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనడం, తిప్పికొట్టడం సరిపోదని జైట్లీ అన్నారు. దేశాన్ని అర్థం చేసుకోలేనివారు, దేశ భద్రతను పట్టించుకోని వారు, దేశం భావోద్రేకాలను అర్థం చేసుకోలేనివారు మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేస్తారని పిట్రోడాను ఉద్దేశించి అన్నారు.
ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు చూసుకుందాలే అన్నది సరైన విధానం కాదని జైట్లీ చెప్పారు. ‘మెరుపుదాడులు, వైమానిక దాడులను ప్రపంచంలోని ఏ ఇతర దేశం ఖండించలేదు. రెండు దాడులూ విజయవంతమయ్యాయి. ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బతీశాం’అని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. దాడుల్లో పాల్గొన్న భారత సైనికులు సురక్షితంగా తిరిగి వచ్చారన్న జైట్లీ ‘దాడులు ఉగ్రవాదులపై జరిగాయి తప్ప ఇతరులపై కాదు’అని వెల్లడించారు. భారత్ దాడులను ఏ ఇస్లామిక్ దేశం తప్పుపట్టలేదు, ఖండించలేదని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ వాదనను సమర్థించే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతకర్త కావడం దౌర్భాగ్యమని మంత్రి నిప్పులు చెరిగారు. ‘క్రికెట్‌లో విజయం సాధించాలంటే బ్యాక్ ఫూట్‌లో ఆడకూడదు. ఫ్రంట్ ఫూట్‌తో ఆడితేనే విజయం సాధిస్తాం. దేశ భద్రత విషయంలో కూడా మోదీ ప్రభుత్వం ఫ్రంట్ ఫూట్ విధానాన్ని అవలంభిస్తోంది’అని ఆయన చలోక్తులు విసిరారు. గురువే అసమర్థుడైనప్పుడు ఇక శిష్యుడు ఎంత అసమర్థుడనేది విడిగా చెప్పనక్కర లేదంటూ శామ్‌పిట్రోడా, రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. దేశ భద్రత కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసే వారు కావాలా లేక ఉగ్రవాదం పట్ల మెతకవైఖరి అవలంభించే వారు కావాలా? అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. ముంబయిపై దాడి చేసిన ఎనిమిది మంది ఉగ్రవాదుల వెనక పాకిస్తాన్ ఉందన్న విషయం పిట్రోడాకు తెలియదా?అని జైట్లీ నిలదీశారు.
ఇదిలా ఉంటే శుక్రవారం బీజేపీలో చేరిన ప్రముఖ క్రికెటర్ గౌతం గంభీర్‌ను ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దించుతున్నట్టు తెలిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పటిమ, బీజేపీ విధానాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు గంభీర్ వెల్లడించారు.