జాతీయ వార్తలు

వెంటనే క్షమాపణ చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగర్తలా, మార్చి 23: తమ పార్టీని త్రిపుర ముఖ్యమంత్రి బిప్‌లాబ్ కుమార్‌దేవ్ నీచ పదాలు ఉచ్ఛరిస్తూ ఇష్టం వచ్చినట్లు దూషించడం తగదని, వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తమ పార్టీని గుంటనక్క, దొంగ, సైతాన్ అని మాట్లాడడం తగదని పేర్కొంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి హుందాతనాన్ని కోల్పోరాదన్నారు. ఇటీవల బీజేపీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్ దేవ్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా దొంగలు, దుర్మార్గులు, మోసగాళ్లు, సైతాన్లు అని కాంగ్రెస్ పార్టీని తిట్టారు. ఇంకా బ్రోకర్, గుంటనక్క అనే పదాలను వాడారన్నారు. తమపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత మానిక్‌సర్కార్, ప్రస్తుత ముఖ్యమంత్రి కుమార్ దేవ్ ఇద్దరూ కూడా కాంగ్రెస్‌ను అణగదొక్కేందుకు చేతులు కలిపారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. కాని ఈ ఇద్దరి అపవిత్ర కలయికను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కును దుర్వినియోగం చేయరాదని అన్నారు. దీనివల్ల ప్రజల దృష్టిలో రాజకీయ నాయకులు చులకనవుతారని అన్నారు. రాజకీయ పార్టీలు కేవలం అధికారం కోసం తాపత్రయపడడం మానుకోవాలని హితవు పలికారు.