జాతీయ వార్తలు

పూరీ నుంచి సంబిత్ పాత్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, మార్చి 23: ఒడిశాలోని పూరీ లోక్‌సభ సీటు నుంచి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రాను పోటీకి దింపారు. ఈ సీటు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి మోదీ పోటీ చేస్తారని బీజేపీ జాబితాలో ప్రకటించింది. కాగా పూరీ లోక్‌సభ సీటు నుంచి పోటీచేసే అభ్యర్థులను బీజేడీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఇంకా ప్రకటించలేదు. ఒడిశాలో 22 అసెంబ్లీ స్థానాలకు, ఐదు పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బసంత్ కుమార్ పండా కలహండి నుంచి, బీజేపీ జాతీయ కార్యదర్శి సురేష్ పూజారి బరంగ్, సిటింగ్ ఎమ్మెల్యే నితీష్ గంగా దేవ్ సంబల్‌పూర్ నుంచి, జయరాం పంగి కోరాపుట్ నుంచి పోటీచేస్తారు. పండా గతంలో నౌపడ ఆసెంబ్లీ సీటు నుంచి పోటీ చేశారు. కందామల్ లోక్‌సభ సీటు నుంచి అభ్యర్థిని బీజేపీ ఇంకా ప్రకటించలేదు. ఇక్కడ బీజేడీ అభ్యర్థిగా రాజ్యసభ ఎంపీ అచుత్ సమంతను, కాంగ్రెస్ పార్టీ మనోజ్ కుమార్ ఆచార్యను పోటీకి నిలబెట్టింది. బీజేపీ ఈసారి సినీ నటి పింకీ ప్రదాన్‌కు దిగాపహంతి సీటు నుంచి అసెంబ్లీ టిక్కెట్‌ను ఇచ్చింది. ఇంతవరకు పదిలోక్‌సభ స్థానాలకు, 99 అసెంబ్లీ సీట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఒడిశాలో 21 లోక్‌సభ సీట్లు, 147 అసెంబ్లీ సీట్లున్నాయి. రెండు దశల్లో ఏప్రిల్ 11, 18 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.